DSC: టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్‌లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌.. జూన్‌లో పోస్టింగ్!

ఏపీ నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. జూన్‌లో స్కూళ్లు మొదలయ్యేలోపే పోస్టింగ్‌లు కూడా ఇస్తామని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు. 

New Update
DSC 2024

AP Mega DSC notification released in April cm chandrababu anounce

AP DSC: ఏపీ నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో  మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. జూన్‌లో స్కూళ్లు మొదలయ్యేలోపే పోస్టింగ్‌లు కూడా ఇస్తామని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు. 

ఎస్సీ వర్గీకరణ తర్వాతే కేటాయింపులు..

ఈ మేరకు ఎన్నికల హామీలో భాగంగా తమ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా16 వేల 347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మార్చిలోనే రిలీజ్ చేయాల్సినప్పటికీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఆలస్యం అయిందని, ఈ కోడ్ ముగియగానే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని లోకేష్ చెప్పిన అంశంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. 'మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ అకాడమిక్ మొదలయ్యే నాటికి ఖాళీల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తాం. నియామకాల కేటాయింపులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ అమలుపై ఆర్డినెన్స్ జారీ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు. 

ఇది కూడా చూడండి: Betting Apps Anvesh: యూట్యూబర్‌ VR రాజాపై అన్వేష్ ఫైర్.. గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం!

ఇక మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు సీఎం ప్రకటనపై సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు. వేలాది మంది కోచింగ్ తీసుకుని సిద్ధంగా ఉన్నామని, వీలైనంత త్వరగా నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగుల వెతలు తీర్చాలని కోరుతున్నారు. 

Also Read: SIKANDAR Trailer: వైలెన్స్, లవ్, యాక్షన్, డ్రామా.. సల్మాన్ ఖాన్ 'సికందర్' ట్రైలర్ భలే ఉంది!

AP Mega DSC Latest Updates | cm-chandrababu | today telugu news | rtv telugu news 

Advertisment
Advertisment
Advertisment