/rtv/media/media_files/2025/03/26/n1NPMZYOLbsGmdXqeU7M.jpg)
AI jobs up for grabs Photograph: (AI jobs up for grabs )
AI jobs: ఇప్పుడిప్పుడే పట్టాలు తీసుకొని ఉద్యోగాల బాట పట్టిన వాళ్లకు, అసరు కొసరు నాల్డెజ్‌తో జాబ్ నెట్టుకొస్తున్న వారికి గుండెల్లో హడల్ పోయే వార్తే ఇది. పెరుగుతున్న టెక్నాలజీని చూసి సంతోష పడుతున్న మనమే.. మరో రెండేళ్ల తర్వాత పాపం కుర్రోళ్లు అనుకునే రోజులు వస్తాయట. అసలు మ్యాటర్ ఏంటంటే.. 2027 నాటికి ఇండియాలో AI కారణంగా 23 లక్షల మంది వారి ఉద్యోగాలు కోల్పోతారని అంచనాలు చెబుతున్నాయి. కానీ వాటిని భర్తీ చేయడానికి నైపుణ్యం కలిగిన నిపుణుల కొరతను దేశం ఎదుర్కోవాల్సి వస్తుందని బెయిన్ & కంపెనీ కొత్త అధ్యయనం తెలిపింది. ఆ సమయానికి భారతదేశ AI టాలెంట్ పూల్ దాదాపు 1.2 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేయబడినప్పటికీ, ఇంకా 1 మిలియన్ కంటే ఎక్కువ ప్లేస్‌మెంట్స్ ఖాళీగా ఉంటాయి. దీనిపై ఫొకస్ చేసి రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ ప్రయత్నాలు అవసరం.
Also read: New income Tax: ఫోన్ డేటాతో బయటకు రానున్న బ్లాక్ మనీ.. పన్ను ఎగవేతదారులు బిగ్ షాక్!
Insightful conversations here at the AWS Gen AI Loft.
— Mukul Sharma (@stufflistings) August 9, 2024
Generative AI is indeed going to be a game changer and a job enabler in the coming years.
India's economy is projected to become the third largest by 2027, and Generative AI will play a crucial role in this progress by… pic.twitter.com/C964rd7eya
Also read : యూఎస్ హెల్త్ ఏజెన్సీకి అధిపతిగా భారత సంతతి వ్యక్తి నియామకం!
2019 నుంచి ప్రతీ సంవత్సరం AI-సంబంధిత ఉద్యోగ పోస్టింగ్‌లు 21% పెరిగాయని, AI పాత్రలకు జీతాలు వార్షిక రేటు 11% పెరిగాయని బెయిన్ సర్వేలో తేలింది. ఈ పెరుగుదల ఉన్నప్పటికీ, స్కిల్ ఉన్న ఉద్యోగులు దొరకడం లేదని అవసరానికి తగ్గట్టుగా వారికి డిమాండ్ అనుగుణంగా లేదు. AI స్కిల్స్ లేకపోవడం ఒక ముఖ్యమైన సవాలు. కానీ అది అధిగమించలేనిది కాదు. AIలో భారత్ ఎలా ఎదుగుతుందని ఇప్పటి నుంచే బాటలు వేయాలని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Komatireddy Rajagopal Reddy: మా రేవంత్ రెడ్డి చాలా మంచోడు...లేకుంటే....