Jharkhand Politics:జార్ఖండ్‌లో ప్రభుత్వం పడిపోతుందా? ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలిస్తున్న జేఎంఎం

జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ఎదురవనుందా అంటే అవుననే అంటున్నారు. సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత అక్కడ రాజకీయ కల్లోలం ఏర్పడింది. దీంతో తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలిస్తోంది.

New Update
Jharkhand Politics:జార్ఖండ్‌లో ప్రభుత్వం పడిపోతుందా? ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలిస్తున్న జేఎంఎం

Jharkhand Politics:జార్ఖండ్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత అక్కడి ప్రభుత్ం పడిపోతుందనే అనుమానాలు బలపడుతున్నాయి. చంపై సోరెన్‌నె సీఎంగా ప్రకటించిన తర్వాత తమ సొంత పార్టీలోనే నిరసన స్వరాలు వినిపిస్తుండడంతో ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళ్ళిపోకుండా ఉండడానికి జార్ఖండ్ ముక్తి మోర్చా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తమ పార్టీకి చెందిన 35 మంది ఎమ్మెల్యేలను రాంచీ నుంచి ప్రత్యేక ఛార్టర్డ్ విమానంలో హైదరాబాద్ లేదా బెంగళూరు తరలించేందు ప్లాన్ చేసింది. ఈరోజు రాజ్‌భవన్‌ నుంచి ఆహ్వానం రాకుంటే ఈ ఎమ్మెల్యేలను తరలించనున్నారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

Also read:Budget 2024-25:వేతన జీవులకు లభించని ఊరట..యథాతథంగా ట్యాక్స్ విధానం.

సోరెన్ కుటుంబంలోనే ఇంటిపోరు...

హేమంత్ సోరెన్ అరెస్ట్‌ అయితే తరువాతి ముఖ్యమంత్రి ఆయన బార్య కల్పానా సోరెన్ సీఎం అవుతారని అంతా అనుకున్నారు. కానీ ఆమెను సీఎం చేసేందుకు తాను వ్యతిరేకమని జేఎంఎపం నేత శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ అడ్డుపుల్ల వేశారు. అసలు ఎమ్మెల్యే కాని వాళ్ళని సీఎం ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. పార్టీలో ఎంతో మంది సీనియర్ నేతలుండగా కల్పనా పేరెందుకు ప్రచారం చేస్తున్నాంటూ ప్రశ్నించారు. కుటుంబం నుంచే సీఎంను ఎన్నుకోవాలంటే ఇంట్లో నేనే సీనియర్‌ను... 14 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా. కల్పానాను ముఖ్యమంత్రి చేయాడానికి వీలులేదు అంటూ నిరసనకు దిగారు. దీంతో చంపయ్ సోరెన్నను సీఎంగా ఎన్నుకొన్నారు. చంపయీ సోరెన్‌ ప్రస్తుతం రవాణాశాఖ మంత్రిగా ఉన్నారు. సెరికెల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1991 నుంచి 3 దశాబ్దాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. జేఎంఎం అధినేత శిబు సోరెన్‌కు అత్యంత సన్నిహితుడు.

అరెస్ట్‌కు ముందు..

ఇక హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేయడానికి ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అతనిని నివాసానికి చేరుకుని 7 గంటలకుపైగా ప్రశ్నించింది. మొత్తం 15 ప్రశ్నలను సంధించగా హేమంత్ సమాధానాలివ్వలేదని తెలిసింది. ఆతరువాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ముందు హేమంత్‌ను ఇంటి నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అరెస్టుకు ముందు హేమంత్ సోరెన్ రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌కు రాజీనామా సమర్పించారు. గవర్నర్ కూడా వెంటనే రాజీనామాను ఆమోదించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు