Jharkhand: ఈనెల 30న బీజేపీలోకి చంపయ్ సోరెన్..

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ ఈ నెల 30న బీజేపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత అధికారికంగా కన్ఫామ్ చేశారు. రీసెంట్‌గానే చంపయ్ సోరెన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

New Update
Jharkhand: ఈనెల 30న బీజేపీలోకి చంపయ్ సోరెన్..

Champai Soren: మరికొన్ని రోజుల్లో ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మధ్యనే ఆ రాష్ట్ర సీఎం చంపయ్ పోరెన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందు ముఖ్యమంత్రిగా చేసిన హేమంత్ పోరెన్ భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన జైలు నుంచి విడుదల అయ్యాక చంపయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఈయన బీజేపీలో చేరతారంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలను నిజం చేస్తూ ముక్తిమోర్చా నేత చంపయ్ సోరెన్ బీజేపీలోచేరుతున్నట్టు ప్రకటించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, దివాసీ నాయకుడు చంపయ్ ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారని..ఆయన అధికారికంగా ఆగస్టు 30న బీజేపీ కండువా కప్పుకుంటారని బిశ్వశర్మ అందులో రాశారు.

Also Read: Afghanistan: ఆఫ్ఘాన్‌లో మహిళలపై మళ్ళీ ఆంక్షలు

Advertisment
Advertisment
తాజా కథనాలు