Ram Charan : బుచ్చిబాబు మూవీలో రామ్ చరణ్ పక్కన దేవర బ్యూటీ.. ! ఉప్పెన ఫేం దర్శకుడు సాన బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు బోనీ కపూరే స్వయంగా ప్రకటించారు. విషయం తెలుసుకున్న మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. By Bhavana 06 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Devara Beauty : రామ్చరణ్(Ram Charan) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చరణ్ శంకర్ సినిమా '' గేమ్ ఛేంజర్''(Game Changer) షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇంకా ఈ సినిమా పూర్తి కాకముందే చరణ్ తన తరువాత సినిమా గురించి కూడా అనౌన్స్ చేసేశాడు. ఉప్పెన సినిమాతో ఎన్నో అవార్డులను అందుకున్న సాన బుచ్చిబాబు(Buchi Babu) దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా నిర్మించబోతున్నట్లు రెండు నెలల ముందే ప్రకటించారు. ఈ సినిమా శ్రీకాకుళం ప్రాంతీయ యాస, భాషల నేపథ్యంలో తీస్తున్నట్లు బుచ్చిబాబు ప్రకటించారు. ఈ చిత్రంలో నటించేందుకు నటీనటులకు ఆడిషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ సాగుతోంది. అతి త్వరలోనే చరణ్ ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటిస్తున్నట్లు స్వయంగా బోనీ కపూర్ నే ప్రకటించారు. ప్రస్తుతం జాన్వీ దేవర(Devara) సినిమాలో ఎన్టీఆర్(NTR) సరసన నటిస్తుంది. ఆ సినిమా పూర్తవగానే చరణ్ సినిమాలో జాన్వీ పాల్గొనన్నుట్లు చిత్ర బృందం తెలిపింది. వెండి తెర మీద మెగాస్టార్ చిరంజీవి - శ్రీదేవిలది ఎంత పెద్ద హిట్ కాంబినేషన్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు వారి వారసులు అయినటువంటి చరణ్, జాన్వీ జోడి కడుతున్నారంటే మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. ఈ సినిమాలో జాన్వీ చరణ్ సరసన ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు తెరకు జాన్వీ ముందుగా దేవర సినిమాతో రాబోతుంది. దేవర చిత్రం ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్ . ఇదిలా ఉంటే జాన్వీ గురించి మరో వార్త కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది. అది ఏంటంటే.. పుష్ప 2 సినిమాలో కూడా జాన్వీ నటించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో జాన్వీతో ఓ ప్రత్యేక గీతం చేయించాలని చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన షూటింగ్ జూన్ లో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. Also Read : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఒకరి మృతి! #rc16 #buchi-babu #ramcharan #janhvi-kapoor సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి