IT Jobs: ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. ఇక అంతే సంగతులు ప్రస్తుతం ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాన్ని తగ్గించేశాయి. అయితే రాబోయే ఆరునెలల్లో కూడా ఐటీ ఉద్యోగం వెతుక్కునే వారికి మరింత గడ్డుకాలం ఉండనుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చాలావరకు పలు ఐటీ కంపెనీలు క్యాంపస్ నియామకాల కోసం వెళ్లకపోవడం ఆందోళన కలిగిస్తోంది. By B Aravind 26 Oct 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఈ మధ్యకాలంలో చాలామంది యువతీయువకులు ఐటీ జాబ్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ఐటీ సంస్థలు కూడా ఫ్రెషర్లకు భారీగా ఆఫర్లు ఇస్తున్నాయి. అయితే గత కొన్ని నెలలుగా ఐటీ ఉద్యోగం కోసం వెతికేవారికి గడ్డుకాలం నడుస్తోంది. అలాగే రాబోయే ఆరు నెలలు కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం దిగ్గజ ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాన్ని తగ్గించాయి. ఇక ఆర్థిక అనిశ్చితులను పరిగణలోకి తీసుకుంటే.. ఈ ఆర్థిక ఏడాది రెండవ అర్ధభాగంలో గతంలో ఎప్పుడు లేని విధంగా మరింత తక్కువగా ఉంటాయిని భావిస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం క్లయింట్లు కూడా ఖర్చులను తగ్గించుకుంటున్న తరుణంలో కంపెనీలు తాము ఇప్పటికే చేసిన అన్ని జాబ్ ఆఫర్లను గౌరవిస్తూ విధుల్లోకి తీసుకోవాలని.. అలాగే ఇప్పుడు బెంచ్‌లో ఉన్నవారిని కూడా పూర్తిగా వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. కానీ ఇక్కడే చాలావరకు ఐటీ కంపెనీలు క్యాంపస్ నియామకాల లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. ఇక ఇప్పటికే ఫ్రెషర్ బెంచ్‌లో ఎక్కువ మంది ఉన్నారని ఇన్ఫోసిస్ తెలిపింది. ప్రస్తుతమైతే ఇంకా క్యాంపస్‌లకు వెళ్లడం లేదని.. కంపెనీ క్యూ2 ఆదాయల సదస్సులో ఇన్ఫోసిస్ సీఎఫ్‌ఓ నిలంజన్ రాయ్ పేర్కొన్నారు. అయితే గతేడాది ఇన్ఫోసిస్ దాదాపు 50 వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంది. ఇక విప్రో కంపెనీ కూడా ఫ్రెషర్ల నియామకాల జలికి వెళ్లడం లేదు. ఇక స్టాంఫింగ్ సంస్థ ఎక్స్‌ఫినో 2024 ఆర్థిక ఏడాది ఔట్‌లుక్ హెడ్‌కౌంట్‌లో 2023 ఆర్థిక ఏడాది ముగింపు కంటే 2.4 శాతం నికర వార్షిక వృద్ధి ఉన్నట్లు పేర్కొంది. Also Read: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు.. 28 ఏళ్లకు ఆ జాబ్ వచ్చింది.. ఈ ఆర్థిక ఏడాది హెడ్‌కౌంట్ దాదాపు 2 లక్షలు పెరుగుతుందని తెలిపింది. 2023 మార్చి నాటికి 66 లక్షలుగా ఉన్న ఐటీ సెక్టార్ హెడ్‌కౌంట్.. వచ్చే ఏడాది మార్చి నాటికి 68 లక్షల మార్క్ కంటే తక్కువగానే ఉంటుందని చెప్పింది. ఈ ఏడాది ఐటీ రంగంలో గణనీయమైన మార్పులు జరిగాయని.. ఎంట్రీ లెవల్ స్థానాలకు డిమాండ్‌లో దాదాపు 25 నుంచి 30 శాతం వరకు క్షీణించినట్లు సీఐఈఎల్ హెచ్‌ఆర్ సర్వీసెస్ ఎండీ, సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా పేర్కొన్నారు. #telugu-news #it-jobs #jobs #it-companies #it-sector మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి