/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/somanath-jpg.webp)
ISRO: చంద్రయాన్-3 (Chandrayaan 3)ను ప్రపంచం మొత్తం ప్రశంసిస్తోందని, మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారని ఇస్రో చైర్మన్ సోమననాథ్ (Somanath) అన్నారు. కొత్త రాకెట్ ఎస్ఎస్ఎల్వీని విజయవంతం చేశామన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా గడిచిన ఏడాది కాలంలో స్పేస్ రంగంలో భారత్ సాధించిన విజయాలను ఆయన వివరించారు.
గత స్వాతంత్ర్య దినోత్సవం (2022) నుండి ఇప్పటి వరకు తాము అనేక మిషన్స్ ను సక్సెస్ చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో విజయాలను సాధించామని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది తాము కేవలం రికార్డులను బద్దలు కొట్టడమే కాదు అనేక ప్రత్యేక మైన మిషన్లను కూడా నిర్వహించామన్నారు. గత ఏడాదిలో మీరు సాధించిన అద్భుతమైన విజయానికి ఇస్రో(ISRO) కేంద్రాలు, అంతరిక్ష శాఖలోని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
సంఖ్యా పరంగా ఈ ఏడాది అత్యధికంగా శాటిలైట్లను నిర్మించి ప్రయోగించామన్నారు. తాము ఎల్వీఎం-3 (LVM-3) ద్వారా ప్రపంచ వాణిజ్య మార్కెట్ పై ఆధిపత్యం సాధించగలిగామన్నారు. తాము ఓషియన్ శాట్-3ని ప్రయోగించామన్నారు. ఇది ఇంజినీరింగ్ పరంగా ఓ అద్బుతమన్నారు. రాబోయే కొన్ని వారాల్లో ఆదిత్య-ఎల్ -1 (Aditya L-1)ను ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో మరిన్ని అద్బుతాలు సృష్టిస్తామన్నారు. భారత తొలి పొలారిమెట్రీ మిషన్ ప్రయోగానికి రెడీగా వుందన్నారు. వాతావరణంపై అధ్యయనం చేసేందుకు మరో ఉపగ్రహం ఇన్సాట్-3డీఎస్ ను ప్రయోగిస్తామని వెల్లడించారు. ఈ ఏడాది గగన్‌యాన్ టెస్ట్ వెహికల్ మిషన్‌ను ప్రయోగిస్తామన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అన్‌క్రూడ్ మిషన్‌కు సిద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు. నాసాతో కలిసి NISAR అనే మిషన్ ను ప్రారంభిస్తామన్నారు.
Also Read: చరిత్ర సృష్టించేందుకు ఇస్రో రెడీ.. సూర్యుడే టార్గెట్
BIG BREAKING : పాకిస్థాన్ కు సపోర్ట్ .. అస్సాం ఎమ్మెల్యే అరెస్ట్!
పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రధాని మోదీ, అమిత్ షాలు ఉన్నారంటూ అస్సాం ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ కు సపోర్ట్ చేసిన, చేయడానికి ప్రయత్నించిన సహించబోమని సీఎం హిమంత అన్నారు. సదురు ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
arrest mla assam
పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఉన్నారంటూ అస్సాం ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ కు సపోర్ట్ చేసిన, చేయడానికి ప్రయత్నించిన సహించబోమని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. సదురు ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. "నేను వీడియోను చూశాను. ఇది పాకిస్తాన్‌ను సమర్థించే విధంగా పోస్ట్ చేసినట్లు కనిపిస్తోంది. నేను వెంటనే డీజీపీని చర్య తీసుకోవాలని ఆదేశించాను. రాజద్రోహం ఆరోపణలపై ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు" అని సీఎం అన్నారు.
Also Read : హ్యాట్సాఫ్ అనన్య.. ఇది కూడా దేశభక్తే.. మెచ్చుకోకుండా ఉండలేం!
ఈ ఎటాక్స్ వెనుక మోదీ, అమిత్ షా
కాగా 2018లో కూడా పుల్వామా దాడిలో కూడా కేంద్రం పాత్ర ఉందని తాను నమ్ముతున్నానని.. అందుకే 2019 ఎన్నికల్లో బీజేపీ గెలించిందన్నారు. పుల్వామా దాడి లాగే పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రభుత్వ పాత్ర ఉందనే తాను అనుకుంటున్నానని తెలిపారు. నిజం తేల్చాలని లేకపోతే ఈ ఎటాక్స్ వెనుక మోదీ, అమిత్ షాలు ఉన్నారని నమ్మాల్సి వస్తుందని అన్నారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అస్సాం పోలీసులు ఆయనపై సుమోటుగా కేసు నమోదు చేసి తాజాగా అరెస్ట్ చేశారు.
Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!
Pahalgam Attack హ్యాట్సాఫ్ అనన్య.. ఇది కూడా దేశభక్తే.. మెచ్చుకోకుండా ఉండలేం!
Terror attack: భారత్‌లో కలవనున్న POK.. పాక్ చర్యలకు సరైన సమాధానం అదే!
Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!
Virat Kohli Record: రాజస్థాన్‌తో మ్యాచ్.. కింగ్ కోహ్లీ ముందు భారీ రికార్డు- 3 సిక్సులు బాదితే
RCB vs RR : టాస్ గెలిచిన రాజస్థాన్ .. కీలక ఆటగాడు దూరం!