Israel-Hamas war:మీకు వేరే దారి లేదు..హమాస్‌కు నెతన్యాహు అల్టిమేటం హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇజ్రాయెల్. గాజామీద వాళ్ళ దళాలు విరుచుకుపడుతున్నాయి. కాల్పుల విరమణ చేసేది లేదని అంటోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. హమాస్ ఉగ్రవాదులకు చనిపోవడం లేదా లొంగిపోవడమే మార్గమని అన్నారు. By Manogna alamuru 22 Dec 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి బందీలను విడిచిపెట్టడం, ఒప్పందం ఇవన్నీ ఒకపక్క జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లోనూ హమాస్ ను విడిచిపెట్టేదే లేదంటోంది ఇజ్రాయెల్. వాళ్ళను సమూలంగా నాశనం చేసే వరకు నిద్రపోమని చెబుతోంది. ఇజ్రాయెల్ పధ్రాని నెతన్యాహు ఈ విషయంలో గట్టి పట్టుదలతోనే ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఎవరు తమకు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా హమాస్ మీద దాడులు ఆపేది లేదని తేల్చి చెబుతున్నారు. చనిపోవడం లేదా లొంగిపోవడం ఒక్కటే వారి దగ్గర ఉన్నాయని అంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. Also read:తెలంగాణలో మళ్లీ కరోనా కల్లోలం.. హైదరాబాద్ లో 14 నెలల చిన్నారికి ఆక్సిజన్. హమాస్ దగ్గర ఉన్న బందీలను సురక్షితంగా తమ దగ్గరకు తెచ్చుకుంటామని చెబుతున్నాయి ఇజ్రాయెల్ దళాలు. గాజా నుంచి తమకు ఎటువంటి ముప్పూ లేదని నమ్మకం కుదిరేవరకు పోరాటం సాగుతుందని తెలిపారు. రీసెంట్ గా ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరిగిన వారం రోజుల ఒప్పందంలో హమాస్ తమ దగ్గర ఉన్న బందీల్లో 105 మందిని విడిచిపెట్టింది. ఇంకా నలభైకి పైగా బందీలు వారిదగ్గర ఉన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ తమ జైళ్ళల్లో మగ్గతున్న 240మంది పాలస్తీనియన్లను వదిలిపెట్టింది. ఇరుపక్షాలు తగ్గాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి కానీ ఎవరూ వినిపించుకోవడం లేదు. Also Read:లెక్కల గురువును స్మరించుకుందాం…జాతీయ గణితదినోత్సవం జరుపుకుందాం గాజాస్ట్రిప్‌లో పరిస్థితులు క్షీణిస్తున్నాయి. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు ఉధృతం చేసింది. మిలిటెంట్ల ఆచూకీ కోసం ప్రతి ఇంటినీ జల్లెడ పడుతోంది. మరోవైపు సొరంగాల్లో దాక్కున్న హమాస్ ఉగ్రవాదులను బయటకు రప్పించడానికి సముద్ర జలాలను టన్నెల్స్ లోపలికి వదులుతోంది ఇజ్రాయెల్ సైన్యం. నీళ్ళు నిండితే మమాస్ ఉగ్రవాదులు బయటకు రావడం తప్ప వేరే మార్గం ఉండదని చెబుతోంది. అలా చేయని పక్షంలో వారు ప్రాణాలు వదిలేస్తారని హెచ్చరిస్తోంది. #israel #prime-minister #hamas #benjamin-netanyahu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి