Israel- Hamas: గాజాలో కొనసాగుతున్న యుద్ధం.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం గాజాలో హమాస్‌తో యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ప్రతి పురుషుడు 34 నెలల పాటు తప్పకుండా మిలటరీలో పనిచేయాలనే నిబంధన ఉండగా.. ఇప్పుడు దాన్ని మరో మూడేళ్ల వరకు పెంచినట్లు సమాచారం. By B Aravind 12 Jul 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం గాజాలో భీకర పరిస్థితులు నెలకొన్న వేళ ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ప్రతి పురుషుడు 34 నెలల పాటు తప్పకుండా మిలటరీలో పనిచేయాలనే నిబంధన ఉండేది. అయితే ఇప్పుడు దాన్ని మరో మూడేళ్ల వరకు పెంచినట్లు సమాచారం. ఈ మేరకు సెక్యూరిటీ కేబినేట్ నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయెల్‌కు చెందిన ఓ వార్త సంస్థ కథనంలో ప్రచురితమైంది. తాజాగా తీసుకొచ్చిన ఈ నిబంధనలు మరో ఎనిమిదేళ్ల పాటు కొనసాగే ఛాన్స్ ఉంది. Also read: వైద్య పరీక్షలకు సిద్ధమే.. జో బైడెన్ కీలక వ్యాఖ్యలు ఆదివారం నిర్వహించనున్న పూర్తిస్థాయి కేబినెట్ సమావేశంలో.. సెక్యూరిటీ కేబినెట్ నిర్ణయాలపై ఓటింగ్ పెట్టనున్నారు. ఒకవైపు హమాస్, మరోవైపు లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్‌బొల్లాతో ఒకేసారి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుందనే కారణంతో ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరో విషయం ఏంటంటే ఈ రెండు ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ పూర్తిగా మద్దతిస్తోంది. ఈ నేపథ్యంలో వీళ్లను ఎదుర్కొనేందుకు సైనికుల బలగాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఇజ్రాయెల్ మిలటరీ కమాండర్లు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ దిశగా చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. అలాగే గతంలో మిలటరీ సర్వీసు నుంచి మినహాయింపు వచ్చిన వేలాదిమంది ఆల్ట్రా ఆర్థోడక్స్ సెమినరీ విద్యార్థులకు సైతం సైన్యంలో చేరాలని నోటీసులు పంపాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. Also read: టైమ్స్ స్వ్కేర్ లాగే.. హైదరాబాద్‌లో త్వరలో టీ స్క్వేర్ #telugu-news #israel #hamas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి