PAK vs IRAN : ఇరాన్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు.. ఇస్లామాబాద్‌లో హై అలెర్ట్! ఇరాన్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని జైష్ అల్ అదిల్ ఉగ్రస్థావరాలపై ఇరాన్ దాడి చేయగా.. ఇరాన్‌లోని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ స్థావరాలపై పాక్ ప్రతిదాడి చేసింది. అటు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో హై అలెర్ట్ ప్రకటించారు. By Trinath 18 Jan 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Pakistan Vs Iran News : ఇరాన్(Iran) లోని వేర్పాటువాద మిలిటెంట్ల స్థావరాలపై పాకిస్థాన్ వరుస సైనిక దాడులకు పాల్పడటం, తాజాగా సరిహద్దు వెంబడి జరిగిన ఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. మధ్యప్రాచ్యం, విస్తృత ప్రాంతంలో ఘర్షణలు విస్తరిస్తున్న సమయంలో పాకిస్థాన్(Pakistan), ఇరాన్ రెండూ ఈ వారంలో ఒకరి భూభాగంపై మరొకరు మిలిటెంట్లపై దాడి చేశాయి. పాక్ ఏం చెబుతోంది? బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో 'మార్గ్ బార్ సర్మాచార్' అనే ఆపరేషన్‌లో భాగంగా తమ బలగాలు అత్యంత సమన్వయంతో కూడిన సైనిక దాడులను ప్రారంభించాయని ఇస్లామాబాద్(Islamabad) చెబుతోంది. ప్రాంతీయ స్వయంప్రతిపత్తి కోసం పోరాడుతున్న రెండు మిలిటెంట్ గ్రూపులైన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(BLA), బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్(BLP) ఈ ఆపరేషన్లో లక్ష్యంగా చేసుకున్న స్థావరాలను ఉపయోగించుకున్నాయని తెలిపింది. శాంతించండి.. శాంతించండి: ఇరాన్ పై పాక్ జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. పాక్ జరిపిన వైమానిక దాడుల్లో నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను పెంచే చర్యలను మానుకోవాలని ఇరాన్‌ను పాకిస్థాన్ హెచ్చరించింది. బలూచిస్థాన్(Balochistan) లోని కొన్ని ఉగ్రవాద స్థావరాలపై ఇరాన్ బుధవారం ఉదయం దాడి చేయగా.. దీనికి ప్రతీకారంగా ఇరాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై పాక్ సైనిక దాడులు చేసింది. BREAKING: Seven killed as Pakistan launches airstrikes on Iran Read more ⬇https://t.co/1GvPQtEjEH — Sky News (@SkyNews) January 18, 2024 ఇక ఇరు దేశాలకు మధ్యవర్తిత్వం వహించేందుకు చైనా(China) ముందుకొచ్చింది. ఇరు పక్షాలు శాంతియుతంగా, సంయమనం పాటించి ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని చైనా భావిస్తోందని, ఇరుపక్షాలు కోరుకుంటే పరిస్థితిని తగ్గించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. దౌత్యం, చర్చల ద్వారా వివాదాస్పద సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరాన్, పాక్‌కు తాలిబన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఇక ఇరాన్, ఇరాక్, పాకిస్థాన్ సంయమనం పాటించాలని టర్కీ చెబుతోంది. అటు ఇరాన్ ఏ సమయంలో ఎటు నుంచి దాడి చేస్తుందోనని పాక్ రాజధాని ఇస్లామాబాద్ అత్యంత అప్రమత్తంగా ఉంది. Also Read: ఇరాన్ మీద పాకిస్తాన్ ప్రతీకార చర్యలు WATCH: #war #balochistan #islamabad #pakistan-vs-iran మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి