Petrol Price : పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గేది అప్పుడేనా? ప్రభుత్వం ఏమంటోంది?

ఇటీవల వంట గ్యాస్ ధరలు తగ్గడంతో.. పెట్రోల్-డీజిల్ ధరలు కూడా తగ్గిస్తారని అందరూ భావిస్తున్నారు. కానీ, కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితి పరిస్థితులు తొలగిపోతేనే పెట్రోల్ ధరల తగ్గింపు ఆలోచన చేయవచ్చని మంత్రి అంటున్నారు. 

New Update
Petrol Price : పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గేది అప్పుడేనా? ప్రభుత్వం ఏమంటోంది?

Petrol Price Decrease : ఎన్నికల వేళ గ్యాస్ ధరలు(Gas Price) తగ్గిస్తూ ప్రధాని మోదీ(PM Modi) ప్రకటన చేశారు. దీంతో పెట్రోల్-డీజిల్ ధరలు కూడా ప్రభుత్వం తగ్గిస్తుంది అని చాలామంది ఆశిస్తున్నారు. నిజానికి చాలాకాలం నుంచి పెట్రోల్ ధరలను తగ్గిస్తారంటూ వార్తలు రావడం.. అవి నిజం కాకపోవడం జరుగుతూ వస్తోంది. అయితే, ఇప్పుడు గ్యాస్ ధరలను తగ్గించడంతో పెట్రోల్ ధరలు కూడా తగ్గిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ప్రభుత్వం నిజంగా పెట్రోల్-డీజిల్ ధరలను(Petrol Price) తగ్గిస్తుందా అనే ప్రశ్నకు ఇప్పటివరకూ కచ్చితమైన జవాబు మాత్రం దొరకడం లేదు. ఇటీవల కేంద్ర పెట్రోలియమ్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఒక కీలక ప్రకటన చేశారు. అందులో పెట్రోల్, డీజిల్ ధరలపై ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. 

పెట్రోల్ డీజిల్ ధరలు(Petrol - Deiseal Price) తగ్గించడానికి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవని మంత్రి చెప్పారు. పెట్రోల్ ధరల తగ్గింపుపై మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ ఆయన ఈ మాట చెప్పారు. ముడిచమురు ధరలు ప్రస్తుతం అంతర్జాతీయంగా అస్థిరంగా ఉన్నాయని అన్నారు. ఆయన చెబుతున్నదని ప్రకారం బయట ప్రపంచ పరిస్థితులు స్థిరంగా మారడం.. అలాగే చమురు ధరల్లో స్థిరత్వం వస్తే పెట్రోల్-డీజిల్ ధరల తగ్గింపు గురించి ఆలోచించవచ్చు. ఎందుకంటే, ప్రస్తుతం ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.. పశ్చిమాసియా ప్రాంతంలో  దాడులు జరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్, ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు భారీగా పెరిగాయి. చమురు ధరలు ఒక్కటీ తగ్గితే సరిపోదు. ఇతర అంశాలు కూడా తక్కువగా ఉండాలి కదా అని మంత్రి చెప్పుకొచ్చారు. మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పిన ఈ మాటలను బట్టి చూస్తే పెట్రోల్-డీజిల్ పై ధరల(Petrol Price) తగ్గుదల అంత తొందరగా జరిగే అవకాశం లేదనిపిస్తుంది. 

Also Read : హైదరాబాద్ సహా ఆరు నగరాల్లో ఆఫీస్ స్పేస్‌కు భారీ డిమాండ్!

అంతేకాకుండా, మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఇంకో మాట కూడా చెప్పారు. బయట పరిస్థితులు ఎలా ఉన్నా.. ముడిచమురు ధరల్లో పెరుగుదల ఉన్నా కానీ,  పెట్రోల్ డీజిల్ ధరల(Petrol Price) ను 2022 మే నెలనుంచి స్థిరంగానే ఉంచిన విషయం గమనించాలని అన్నారు. అలాగే, నవంబర్ 2021- మే 2022 లో ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించింది. ఆలా 2021 నుంచి రెండుసార్లు కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది అని ఆయన వివరించారు. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ.13 తగ్గింపు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించారు. రెండు పర్యాయాలు పన్ను తగ్గింపు వల్ల కేంద్రానికి దాదాపు రూ.2.2 లక్షల కోట్ల మేర ఆదాయ నష్టం వాటిల్లిందని తెలిపారు.

మొత్తంగా చూసుకుంటే.. పెట్రోల్-డీజిల్ ధరల తగ్గుదల కొంచెం కష్టమైనా విషయమే అని అర్ధం అవుతుంది. మంత్రి హర్దీప్ సింగ్ ఈ విషయంలో కీలకమైన సమాచారం ఇచ్చినట్టే అనిపిస్తోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు