Israel- Iran: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత.. త్వరలో మూడో ప్రపంచ యుద్ధం !

ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అమెరికా.. ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా హై అలర్డ్ ప్రకటించింది.

New Update
Israel- Iran: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత.. త్వరలో మూడో ప్రపంచ యుద్ధం !

పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తు్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అమెరికా.. ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది. ఏ సమయంలోనైనా ఇరాన్‌ దాడులతో విరుచుకుపడొచ్చని చెప్పింది. ఇప్పటికే ఇరాన్, మిలిటెంట్ గ్రూపులు దాడులు చేసేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ కూడా హై అలర్డ్ ప్రకటించింది.

Also Read: క్షిపణులతో రష్యా మళ్ళీ దాడి..సాయం చేయమంటున్న జెలెన్ స్కీ

హమాస్, హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల హిజ్బుల్లా టార్గెట్‌గా ఇజ్రాయెల్ 100 మిసైల్స్ ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ఇప్పటికే అమెరికా ప్రకటించింది. మరోవైపు రష్యా, చైనా నుంచి మద్దతు కోసం ఇరాన్ ఎదురుచూస్తోంది. ఇజ్రాయెల్‌పై దాడులు చేసుందుకు ఇస్లామిక్ దేశాలు ఏకతాటిపైకి వస్తున్నాయి. ఇరాన్ నేరుగా రంగంలోకి దిగి.. దాడులు చేస్తే యుద్ధం మరింత ముదిరే ఛాన్స్ ఉంది.

చివరికి ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం కూడా ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలాఉండగా.. ఇప్పటికే ఉక్రెయిన్ - రష్యా మధ్య సుధీర్ఘంగా యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదిరితే ప్రపంచ పరిస్థితులే మారిపోతాయని చెబుతున్నారు.

Also Read: తమిళనాడు మత్స్యకారులను అరెస్ట్‌ చేసిన శ్రీలంక నేవీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు