Iran Vs Israel: ఇజ్రాయెల్‌పై ఆత్మాహుతి డ్రోన్లతో దాడికి దిగిన ఇరాన్ అనుకున్నట్టుగానే ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడులు మొదలుపెట్టింది. డజన్లకొద్దీ ఆత్మాహుతి డ్రోన్లతో అటాక్ చేయడానికి సిద్ధమైంది. మరో తొమ్మిది గంటల్లో ఇవన్నీ ఇజ్రాయెల్ మీద విరుచుకుపడతాయని తెలుస్తోంది. By Manogna alamuru 14 Apr 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Iran Is Ready To Attack: భద్రతా వర్గాలు నివేదికల్లో తెలిపినట్టుగానే ఇరాన్ అడుగులు వేస్తోంది. ఇజ్రాయెల్ మీద కయ్యానికి కాలు దువ్వుతోంది. మరో 24గంటల్లో అటాక్ చేస్తారని చెప్పినట్టుగానే ఇరాన్ ఆ దిశగా డ్రోన్లను ప్రయోగిస్తోంది. డజన్ల కొద్దీ డ్రోన్లు ఇజ్రాయెల్ మీద విరుచుకుపడడానికి ఇప్పటికే బయలు దేరాయి. ఇరాక్‌లోని సులేమానియా ప్రావిన్స్ మీద ఈ డ్రోన్లు తిరుగుతూ కనిపించాయి. మరో తొమ్మిది గంటల్లో ఇవి ఇజ్రాయెల్ మీద దాడులు మొదలుపెడతాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. Last thought for tonight, Iran’s attack was clearly meant to reinstate deterrence and not to provoke a war. Whether the objective was the contrary we would have seen more complex effort and vital roles played by Hezbollah and other allied groups in the region. The objective was… pic.twitter.com/QWJJC8ORRL — Ali Hashem علي هاشم (@alihashem_tv) April 14, 2024 అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం.. మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఈ దాడులను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. వైమానికి, డ్రోన్, రాకెట్ ఎలాంటి ప్రయోగాలైనా వాటిని సురక్షితంగా అడ్డుకుంటామని చెబుతోంది. ఇజ్రాయెల్ వింగ్ ఆఫ్ జియాన్ ఆ దిశగా తమ సామర్ధ్యాన్ని విస్తరించుకుంటోంది. యూఎస్ ఎయిర్ ఫోర్స్ వన్‌కు సమానంగా ఉండే వింగ్ ఆఫ్ జియాన్ చాలా శక్తివంతమైనది అని...ఎటువంటి దాడులను అయినా ఎదుర్కోగలమని చెబుతున్నాయి ఇజ్రాయెల్ సైన్యాలు. One of the impacts in southern Israel pic.twitter.com/ewM9fVMCBu — Ali Hashem علي هاشم (@alihashem_tv) April 13, 2024 ఒక్కొక్క దానిలో 20 కిలోల పేలుడు పదార్ధాలు.. ఇక ఇజ్రాయెల్ ప్రయోగించిన డ్రోన్లు ఒక్కొక్కటి 20 కిలోల పేలుడు పదార్ధాలతో తయారు చేయబడ్డాయి. ఇవన్నీ ఆత్మాహుతి డ్రోన్లు. ఇరాక్ గగనతలంలో ఈ అటాకింగ్ డ్రోన్లు గుంపులుగా తిరుగుతూ కనిపిస్తున్నాయని చెబుతున్నాయి భద్రతా వర్గాలు. ఇరాన్ ప్రయోగిస్తున్న ఈ డ్రోన్లు ఇజ్రాయెల్ వైమానికి దాడులను తిప్పి కొట్టగలవని తెలిపారు. ఇవి చేరుకోవడం అయితే 12 నిమిషాల్లో చేరుకుంటాయి కానీ అవి అటాక్ చేయడానికి మాత్రం తొమ్మది గంటలు పడుతుందని అంటున్నారు. Also Read:Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల కలకలం #israel #iran #attck #drones మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి