Iran Vs Israel : ఇరాన్‌పై ఇజ్రాయెల్ డ్రోన్ల దాడి..ఆవి బాంబులు కాదు ఆటబొమ్మలన్న ఇరాన్

పశ్చిమాసియాలో మళ్ళీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. నిన్న తెల్లవారుఝామున ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌లో పేలుళ్ళు సంభవించాయి. అయితే దీని మీద ఇరాన్ స్పందిస్తూ ఇజ్రాయెల్‌ కనుక దాడులకు పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని అంది.

New Update
Iran Vs Israel : ఇరాన్‌పై ఇజ్రాయెల్ డ్రోన్ల దాడి..ఆవి బాంబులు కాదు ఆటబొమ్మలన్న ఇరాన్

Iran Vs Israel War : ఇరాన్(Iran) సైనిక స్థావరాల మీద ఇజ్రాయెల్(Israel) దాడులకు పాల్పడింది. ఆదేశంలోని మూడో అతి పెద్ద నగరమైన ఇస్ఫహాన్‌లో డ్రోన్లతో అటాక్ చేసింది. ఈ దాడిలో హష్ద్ షాబీ బలగాలకు చెందిన మందుగుండు సామగ్రి గిడ్డంగి ధ్వంసమైంది. అలాగే, ట్యాంక్ ప్రధాన కార్యాలయం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ దాడుల్లో ఒకరు చనిపోగా, ఆరుగురు వ్యక్తు గాయపడ్డారు. ఇరాన్ పై ఇజ్రయెల్ఏ దాడులు చేసిందని అమెరికా ధృవీకరించింది. అయితే ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, టెహ్రాన్ మాత్రం దీని మీద ఇప్పటివరకు స్పందించలేదు.

అదే కనుక అయితే తీవ్ర పరిణామాలు తప్పవు..

మరోవైపు తమ మీద జరిగిన దాడుల మీద ఇరాన్ స్పందించింది. నిజంగా కనుక ఇజ్రాయెల్ ప్రతీకార దాడులను చేసినట్లయితే ఫలితం అనుభవించక తప్పదని అంటోంది. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరిస్తోంది. అమెరికా(America) పర్యటనలో ఉన్న ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్(Hossein Amir-Abdollahian) ఈ దాడుల మీద మీడియాతో మాట్లాడారు. ప్ఉరస్తుతం ఇజ్రాయెల్ చేసిన దాడులు మాదేవానికి ఏం నష్టం కలిగించలేదు కాబట్టి మేము ప్రతిచర్యలకు దిగడం లేదని హోస్సేన్ అన్నారు. కానీ ఒకవేళ అది తమ దేవానికి తీవ్ర నష్టం కలిగించేది అయితే మాత్రం మా ప్రతి స్పందన చాలా వేగంగా, కఠినంగా ఉంటుందని తెలిపారు. దానికి వాళ్ళు పశ్చాత్తాపడాల్సి ఉంటుందని చెప్పారు. మరోవైపు శుక్రవారం ఇజ్రాయెల్ ప్రయోగించిన డ్రోన్లు చిన్న పిల్లల ఆటబొమ్మల్లాంటివని హేళన చేశారు హొస్సేన్.

ప్రతీకారేచ్ఛతో రగులుతున్న ఇజ్రాయెల్..

ఈ నెల 13న మూడు వందలకు పైగా డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ ఇజ్రాయెల్ మీద విరుచుకుపడింది. అప్పటి నుంచి దానికి ప్రతీకార దాడులు చేయాలని ఇజ్రాయెల్ రగిలిపోతోంది. ఈ నేపథ్యలో ఇరాన్‌లో పేలుడు సంభవించగానే అవి ప్రతీకార దాడులేనని అందరూ భావించారు. అయితే, ఇరాన్‌ మాత్రం ఖండించింది. తమ గగనతలంలో కనిపించిన అనుమానాస్పద వస్తువులను యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ తుపాకులతో నేలకూల్చామని, ఆ సందర్భంగా పేలుళ్లు జరిగాయని పేర్కొంది. ఇజ్రాయెల్‌ కూడా తామే దాడి చేశామని అధికారికంగా ప్రకటించలేదు.

Also Read:Gold Rates: బాబోయ్ ఇలా పెరుగుతున్నాయేటీ..రోజురోజుకూ కొండెక్కుతున్న బంగారం ధరలు

Advertisment
Advertisment
తాజా కథనాలు