IPL 2024 : ఫైనల్ కు చేరిన కేకేఆర్‌.. హైదరాబాద్‌ మీద ఘన విజయం!

ఐపీఎల్‌ 2024 లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఫైనల్‌ కు చేరుకుంది. మంగళవారం హైదరాబాద్‌ తో జరిగిన క్వాలిఫైయర్‌ 1 మ్యాచ్‌ లో కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో కేకేఆర్ ఫైనల్ కు దూసుకుపోయింది.

New Update
IPL Winner 2024: తెరపై ఒకరు తెరవెనక మరొకరు.. కేకేఆర్ విజయంలో వీరిద్దరిదే కీలకపాత్ర !

KKR : ఐపీఎల్‌ 2024 (IPL 2024) లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఫైనల్‌ కు చేరుకుంది. మంగళవారం హైదరాబాద్‌ (Hyderabad) తో జరిగిన క్వాలిఫైయర్‌ 1 మ్యాచ్‌ లో కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో కేకేఆర్ ఫైనల్ కు దూసుకుపోయింది. 160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌.. 13.4 ఓవర్లలో 164 పరుగులు చేసింది. 38 బంతులు ఉండగానే లక్ష్యాన్ని సాధించింది.

కోల్కతా బ్యాటింగ్ లో శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) (58 నాటౌట్‌) వెంకటేష్ అయ్యర్ (51 నాటౌట్‌) పరుగులతో రెచ్చిపోయారు. అంతకుముందు ఓపెనర్లు రహ్మతుల్లా గుర్బాజ్ (23), సునీల్ నరైన్ (21) పరుగులతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్ బౌలర్లు పరుగులు కట్టడి చేయడంలో విఫలమయ్యారు. కేవలం కమిన్స్, నటరాజన్ తప్ప మిగత వాళ్లు వికెట్ తీసుకోలేకపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ట్రేవిస్ హెడ్ గోల్డెన్ డక్ కాగా.. అభిషేక్ శర్మ కేవలం 3 పరుగులు చేశాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌ కు దిగిన రాహుల్ త్రిపాఠి (Rahul Tripathi) (55), నితీష్ కుమార్ రెడ్డి (9), క్లాసెన్ (32) పరుగులు చేశారు. అబ్దుల్ సమద్ (16), సన్వీర్ సింగ్ డకౌట్ కాగా , కమిన్స్ (30), విజయకాంత్ వియస్కాంత్ (7) పరుగులు చేశారు. సన్ రైజర్స్ బ్యాటర్లలో నలుగురు బ్యాట్స్మెన్లు డకౌట్ అయ్యారు. కోల్కతా బౌలింగ్లో మిచెల్ స్టార్ మొదట్లోనే హెడ్ వికెట్ తీసి హైదరాబాద్‌ ను దెబ్బ తీశాడు. అతని బౌలింగ్లో 3 కీలక వికెట్లు సంపాదించాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టగా.. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, రస్సెల్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

Also read: ఏసీపీ ఉమామహేశ్వర్ రావు అరెస్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు