Pandya vs Rohit : బుద్ధి బయటపడింది.. పాండ్యా వల్లే మ్యాచ్‌ పోయింది.. ఎందుకంటే?

వికెట్లు పడుతున్నా చివరి వరకు బ్యాటింగ్‌కు రాకుండా పాండ్యా ఎందుకున్నాడన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్‌లో భాగంగా గుజరాత్‌పై ముంబై ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పాండ్యా కెప్టెన్సీ స్ట్రాటజీలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Pandya vs Rohit : బుద్ధి బయటపడింది.. పాండ్యా వల్లే మ్యాచ్‌ పోయింది.. ఎందుకంటే?

MI vs GT : హార్దిక్‌ పాండ్యా(Hardik Pandya) ను ముంబై కెప్టెన్‌(Mumbai Captain) గా ఆ ఫ్రాంచైజీ అభిమానులు అంగీకరించడానికి చాలా టైమ్ పట్టింది. సీజన్‌ దగ్గర పడిన తర్వాత జరిగిందేదో జరిగిపోయిందిలే అని మైండ్‌ను అడ్జెస్ట్‌ చేసుకున్నారు. ఎంతైనా ముంబై మొత్తం ఓ కుటుంబమేలే అని సర్థి చెప్పుకున్నారు. అయితే మ్యాచ్‌లో పాండ్యా బిహెవియర్‌ ఏ మాత్రం బాలేదని హిట్‌మ్యాన్‌ ఫ్యాన్స్‌ ఆరోపిస్తున్నారు. పాండ్యా కెప్టెన్‌గా పనికిరాడని తేల్చేస్తున్నారు. దానికి బలయై కారణాలు కూడా చూపిస్తున్నారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. లీగ్‌ ఫస్ట్‌ మ్యాచ్‌ను ఓటమితో ప్రారంభించడం ముంబైకి ఇది 12వ సారి. అయితే ఈ మ్యాచ్‌లో గుజరాత్‌(Gujarat) గెలిచిందని చెప్పెకంటే ముంబై చేజేతులా ఓడిందని చెప్పుకోవాలి. చివరి ఐదు ఓవర్లలో చేయాల్సిన పరుగులు కేవలం 40. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. అయితే రోహిత్‌ ఔటైన తర్వాత ముంబై సైకిల్‌ స్టాండ్‌ను తలపించింది. వరుస పెట్టి వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఇక్కడ పాండ్యా చేసిన తప్పులున్నాయంటున్నారు రోహిత్‌(Rohit Sharma) ఫ్యాన్స్‌.


రషీద్‌ ఖాన్‌ అంటే భయమా?
రోహిత్‌ 3వ వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత పాండ్యా బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే సరిపోయేదని చెబుతున్నారు రోహిత్‌ ఫ్యాన్స్‌. అలా కాకుండా తిలక్‌వర్మను ముందుగా దింపాడు పాండ్యా. అక్కడితో ఆగలేదు.. మరో వికెట్‌ పడిన తర్వాత కూడా పాండ్యా బ్యాటింగ్‌కు రాలేదు. టిమ్‌ డేవిడ్‌ని దింపాడు. ఇది పాండ్యాలోని కెప్టెన్సీ లోపాలను ఎత్తి చూపుతుంది. ఇలా చివరి వరకు బ్యాటింగ్‌కు రాకుండా పాండ్యా స్పైన్‌లెస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడని ఫ్యాన్స్ ట్విట్టర్‌లో అంటున్నారు. ఇక రషీద్‌ ఖాన్‌ స్పెల్‌ అయ్యే వరకు పాండ్యా బ్యాటింగ్‌కు రాకపోవడం మరో విడ్డూరం. మొత్తానికి గెలిచే మ్యాచ్‌ను ముంబై ఓడిపోయింది.


అటు వెళ్లు.. కాదు కాదు.. ఇటు వెళ్లు..:
అటు బౌలింగ్‌ టైమ్‌లోనూ పాండ్యా తప్పిదాలు చేసినట్టుగా కనిపిస్తోంది. టాస్‌ గెలిచి ముందుగా పాండ్యా బౌలింగ్‌ తీసుకున్నాడు. అయితే బుమ్రా, కోట్జి లాంటి బౌలర్లతో తొలి ఓవర్‌ వెయించుకుండా పాండ్యా తనే స్వయంగా బౌలింగ్‌ వేశాడు. దీని వల్ల స్టార్టింగ్‌లో రన్స్‌ లీక్ అయ్యాయి. బుమ్రా బౌలింగ్‌కు వస్తే కానీ రన్స్‌ కట్టడి కాలేదు. మరోవైపు రోహిత్‌ శర్మ ఫీల్డింగ్‌ పొజిషన్‌ను పాండ్యా పదేపదే మార్చాడం పెద్ద దుమారమే రేపుతోంది. కామెంటేటర్లు సైతం పాండ్యా చర్యలకు షాక్‌ అయ్యారంటే నమ్మగలరా? సాధారణంగా 30 యార్డ్‌ లోపల ఫీల్డింగ్‌ చేసే రోహిత్‌ను పాండ్యా లాంగ్‌ ఆన్‌ను వెళ్లామని ఆదేశించడం కెమెరాల్లో చిక్కింది. ఇలా ఒక చోటే పెట్టకుండా రోహిత్‌ను తర్వాత అటు ఇటు తిప్పాడు పాండ్యా. ఇది రోహిత్‌ను అవమానపరచడమేనని కొందరు వాదిస్తుండగా.. కెప్టెన్‌ చెప్పింది చేయాల్సిందేనని.. రోహిత్‌ అందుకు మినాహాయింపు కాదని లీడర్‌షిప్‌ ధర్మాల గురించి మరికొందరు ఉపన్యాసాలు ఇస్తున్నారు. రోహిత్‌, పాండ్యా ఎపిసోడ్‌ తెలిసిన తర్వాత ఇలాంటి లాజిక్కులు నమ్మడం కాస్త కష్టమే!

Also Read : మరోసారి ఫస్ట్‌ మ్యాచ్‌ దేవుడుకి.. ఇలా ఓడిపోకపోతే అంబానీ మావా ఫుడ్‌ పెట్టడు కావొచ్చు!

Advertisment
Advertisment
తాజా కథనాలు