Investments: కేవలం నాలుగేళ్లలో 18 రూపాయల నుంచి 900 రూపాయలకు.. టాటా కంపెనీ స్టాక్ మేజిక్!

స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ రిస్క్ తో కూడుకున్నది. ఒక్కోసారి కొన్ని స్టాక్స్ ఊహించని లాభాలను తెస్తాయి. అలాంటి వాటిలో ఆటోమోటివ్ స్టాంపింగ్స్ కంపెనీ ఒకటి. ఇది టాటా గ్రూప్ సబ్సిడైజర్ కంపెనీ. ఈ కంపెనీ షేర్లు నాలుగేళ్లలో 18 రూపాయల నుంచి 900 రూపాయలకు చేరుకున్నాయి.  

New Update
Investments: కేవలం నాలుగేళ్లలో 18 రూపాయల నుంచి 900 రూపాయలకు.. టాటా కంపెనీ స్టాక్ మేజిక్!

Investments:  స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అయినా.. జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే.. ఒక్కోసారి లాభాల పంట పండుతుంది. కొన్ని కంపెనీల షేర్లు అతి తక్కువ నుంచి ఎక్కువకు ఎగబాకడానికి ఎక్కువ కాలం పట్టదు. అలాంటి స్టాక్స్ గురించి వింటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఇంత లాభాలను తెస్తుందా? అని అనిపించడం సహజం. ఇప్పుడు అలాంటి ఒక స్టాక్ గురించి చెప్పుకుందాం. ఇది టాటా గ్రూపు కంపెనీ షేర్. ఇది నాలుగేళ్లలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5000% పెరిగింది. అంటే నాలుగేళ్ళ క్రితం 18 రూపాయలు ఉన్న ఈ స్టాక్ ఇప్పుడు 900 రూపాయలు దాటింది. కచ్చితంగా చెప్పాలంటే, ఇప్పుడు ఈ కంపెనీ స్టాక్ విలువ 970 రూపాయలు. గత ఆరు నెలలో ఈ స్టాక్ 130% పెరిగింది. అంటే ఆరు నెలల క్రితం ఈ కంపెనీలో 10 వేలు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అది 23 వేల రూపాయలు అయి ఉంటుందన్నమాట. 

Investments:  టాటా గ్రూప్ నకు చెందిన కంపెనీ ఆటోమోటివ్ స్టాంపింగ్స్ కంపెనీ షేర్ల పరుగు ఇది. ఆటోమోటివ్ స్టాంపింగ్స్ (ASAL) ప్యాసింజర్ వెహికిల్స్, కమర్షియల్ వెహికిల్స్,  ట్రాక్టర్ల కోసం షీట్ మెటల్ భాగాలను తయారు చేస్తుంది. జూలై 16, 2024న కంపెనీ షేర్లు రూ.970.65 వద్ద ముగిశాయి. జూలై 17, 2020న అంటే నాలుగేళ్ళ క్రితం ఆటోమోటివ్ స్టాంపింగ్స్ (ASAL) షేర్లు రూ. 18.75 వద్ద ఉన్నాయి. 

గత 4 సంవత్సరాలలో ఆటోమోటివ్ స్టాంపింగ్ షేర్లు 5075% పెరిగాయి. దీనిని మన లెక్కల్లో అర్ధం చేసుకోవాలంటే.. ఎవరైనా ఇన్వెస్టర్ జూలై 17, 2020న ఆటోమోటివ్ స్టాంపింగ్ షేర్లలో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే..  వారి ఇన్వెస్ట్మెంట్ అలానే ఉంచుకుని ఉంటె.. ఇప్పుడు ఆ షేర్ల విలువ  రూ. 51.76 లక్షలు అవుతుంది. అంటే నాలుగేళ్ళ క్రితం లక్ష రూపాయల పెట్టుబడి ఇప్పుడు అరకోటి దాటిందన్నమాట. 

Investments:  ఆటోమోటివ్ స్టాంపింగ్ షేర్లు గత ఏడాదిలో 142% జంప్‌ను చూశాయి. ఈ టాటా గ్రూప్ కంపెనీ షేర్ల ధర జూలై 17, 2023న రూ. 401.05గా ఉంది, ఇది జూలై 17, 2024న రూ.970.30కి చేరుకుంది. ఆటోమోటివ్ స్టాంపింగ్ షేర్లలో పెట్టుబడిదారుల డబ్బు గత 6 నెలల్లో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది.

గత 6 నెలల్లో కంపెనీ షేర్లు దాదాపు 130% లాభపడ్డాయి. ఈ కాలంలో కంపెనీ షేర్లు రూ. 422.45 నుండి రూ. 970 కు చేరుకున్నాయి. ఆటోమోటివ్ స్టాంపింగ్స్ షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 1094.55గా ఉంది. ఇదే సమయంలో కంపెనీ షేర్లు 52 వారాల కనిష్ట స్థాయి రూ. 373 ఉన్నాయి.

Investments:  పూణేలో ఆటోమోటివ్ స్టాంపింగ్ కోసం ఒక ప్లాంట్ ఉంది. కంపెనీకి పంత్‌నగర్‌లో ప్లాంట్ కూడా ఉంది. ప్రస్తుతం, టాటా ఆటోకాంప్ సిస్టమ్స్ లిమిటెడ్ ఆటోమోటివ్ స్టాంపింగ్‌లో 75% వాటాను కలిగి ఉంది. మిగిలిన 25% వాటా పబ్లిక్ లో ఉంది. 

గమనిక:  స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్ తో కూడుకున్నవి.  అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టకండి. ఏదైనా షేర్లలో పెట్టుబడి పెట్టే ముందు మీరు మీ ఆర్థిక సలహాదారుతో ఒకసారి మాట్లాడాలి. అలా చేయడంలో విఫలమైతే ఆర్థికంగా నష్టపోవచ్చు.

Advertisment
Advertisment
తాజా కథనాలు