Zelenskyy: మినరల్స్‌ డీల్‌కు సిద్ధమే, కానీ.. జెలెన్‌స్కీ సంచలన ప్రకటన

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. అమెరికాతో ఖనిజ సంపద ఒప్పందానికి సిద్ధమేనని తెలిపారు. తాము అమెరికాకు రుణపడి ఉంటామని కూడా వరుస ట్వీట్లు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Zelenskyy Says Ready to sign minerals agreement

Zelenskyy Says Ready to sign minerals agreement

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. అమెరికాతో మినరల్స్‌ డీల్‌కు సిద్ధమేనని తెలిపారు. తాము అమెరికాకు రుణపడి ఉంటామని కూడా వరుస ట్వీట్లు చేశారు. ఉక్రెయిన్‌ నిజమైన శాంతిని కోరుకుంటోందని.. అందుకోమే తాము అమెరికాకు వచ్చామని తెలిపారు. అంతకుముందు జెలెన్‌స్కీ ట్రంప్‌తో సమావేశమయ్యారు. రష్యా నుంచి తమకు రక్షణ కల్పించాలని.. ట్రంప్‌, వాన్స్‌లపై జెలెన్‌స్కీ ఒత్తిడి చేశారు. 

Also Read: యూఎస్‌ ఎయిడ్ నిలిపివేత.. భారత్‌లో మూతపడ్డ ఆ క్లినిక్‌లు

అంతేకాదు జెలెన్‌స్కీ ఖనిజ సంపద ఒప్పందంపై సంతకం చేయకుండా వెళ్లిపోయారన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో అమెరికా, ఉక్రెయిన్‌ దేశాధినేతల మధ్య వాగ్వాదం జరిగినట్లు పలు వార్తాసంస్థలు పేర్కొన్నాయి. అయితే చివరికీ తాము ఈ ఖనిజ సంపంద ఒప్పందానికి సిద్ధమేనని జెలెన్‌స్కీ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. '' ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసేందుకు మేము సిద్ధమే. భద్రకు గ్యారంటీ ఇచ్చేందుకు ఇది తొలి అడుగు అవుతుంది. కానీ ఇది సరిపోదు. 

Also Read: మళ్లీ తండ్రయిన మస్క్.. 14వ సారి.. ఏం పేరు పెట్టారో తెలుసా?

మాకు అంతకన్నా ఎక్కువ కావాలి. సెక్యూరిటీ గ్యారెంటీలు లేకుండా కాల్పుల విరమణ ఒప్పందం ఉక్రెయిన్‌కు చాలా ప్రమాదకరం. గత మూడేళ్లుగా మేము పోరాడుతున్నాం. అమెరికా తమ వైపే ఉందని ఉక్రెయిన్ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని'' ఎక్స్‌లో తెలిపారు. అంతేకాదు అమెరికాకు తాము రుణపడి ఉంటామని కూడా మరో ట్వీట్ చేశారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

China: ఇసుక తుఫాను బీభత్సం.. 693 విమాన సర్వీసులు రద్దు!

చైనాను ప్రస్తుతం బలమైన గాలులు, ఇసుక తుఫాను భీకరంగా వణికిస్తున్నాయి.భారీగా గాలులు వీస్తుండగా.. చైనా సర్కారు అప్రమత్తమైంది. మొత్తంగా 693 విమాన సర్వీసులను, వందలాది రైళ్లను రద్దు చేసింది. అలాగే ఎక్కడి వాళ్లను అక్కడే లాక్ చేసేసింది.

New Update
china

china

చైనాలో బలమైన గాలులతో పాటు ఇసుక తుఫాను హడలెత్తిస్తుంది. ఈ బీభత్సమైన విలయంతో దేశ ప్రజలంతా భయంతో విలవిల్లాడిపోతుండగా.. అదికార యంత్రాంగం అప్రమత్తం అయింది. ఎక్కడ ఉన్న వాళ్లంతా అక్కడే ఉండాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే వందలాది విమాన సర్వీసులను, రైళ్ల రాకపోకలను రద్దు చేసింది. 

Also Read:Whatsapp: వాట్సాప్‌ సేవల్లో అంతరాయం..!

అంతేకాకుండా దేశంలో జరుగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లు సహా ఇతర ముఖ్య కార్యక్రమాలను సైతం నిలిపి వేసింది. చైనాలో శనివారం రోజు ఉదయం నుంచే బలమైన గాలులు వీస్తున్నాయి. దీనికి తోడు ఇసుక తుఫాను కూడా వస్తుండగా.. దేశం అంతా అల్లకల్లోలంగా మారిపోతోంది. దేశ రాజధాని బీజింగ్‌లో అయితే పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. భారీ గాలులకు అనేక చెట్లు నేలకొరిగాయి. ఎత్తైన స్తంభాలు సైతం పడిపోయాయి. మనుషులు సైతం గాలికి కొట్టుకుపోతుండడం.. తీవ్రంగా ఇసుక గాల్లో కలిసి మనుషులపైకి దూసుకొస్తుండడంతో... అక్కడి సర్కారు అప్రమత్తమైంది. 

Also Read: USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

693 విమాన సర్వీసులను...

బీజింగ్, డాక్సింగ్‌లో మధ్యాహ్నం కల్లా వందలాది విమాన, రైల్వే సర్సీలును అక్కడి  ప్రభుత్వం రద్దు చేసింది.ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల వరకే మొత్తంగా 693 విమాన సర్వీసులను అక్కడి యంత్రాంగం రద్దు చేసింది. అలాగే స్థానికంగా ఉన్న పార్కులను తాత్కాలికంగా మూసేశారు. అంతేకాకుండా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు , ఇతర ముఖ్యమైన కార్యక్రమాలను సైతం నిలిపి వేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ గాలులు, ఇసుక తుఫాను ప్రభావం కొనసాగుతుండగా.. 75 ఏళ్లలో ఎన్నడూ ఇంత శక్తివంతంగా గాలులు వీయలేదని సర్కారు చెబుతోంది. 

ముఖ్యంగా చైనా ఉత్తర, తీర ప్రాంతాల్లో ప్రమాదకర వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఎక్కడ ఉన్న ప్రజలంతా అక్కడే ఉండాలని.. బలమైన గాలులు వీస్తున్నందున ఎలాంటి ప్రమాదాలు అయినా జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ఏదైనా అత్యవసరం అయినా అధికారుల సాయం తీసుకోవాలని చెప్పారు.

Also Read: NASA: ఆ ఐడియా ఇస్తే రూ.25 కోట్ల నజరానా.. నాసా బంపర్ ఆఫర్

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

trains-cancelled | flights-cancelled | flights | china | sand storms | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment