Zelensky: యుద్ధం ఆగాలంటే అది జరగాలి.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్‌న్‌స్కీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ఆపాలంటే కీవ్ అధీనంలో ఉన్నటువంటి భూభాగాలను నాటో పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. స్కై న్యూస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. By B Aravind 30 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అక్కడి ప్రజలు భయాందోళనలో ఉంటున్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తోందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్‌న్‌స్కీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ఆపాలంటే కీవ్ అధీనంలో ఉన్నటువంటి భూభాగాలను నాటో పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. స్కై న్యూస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. Also Read: పంజా విసురుతున్న చలి.. రోజుకు 30-40 న్యూమోనియా కేసులు నాటో హామీ ఇవ్వాలి '' యుద్ధంలోని కీలక దశను ఆపాలంటే మా నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్ భూభాగానికి నాటో భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వాలి. అలా జరిగినప్పుడే కాల్పుల విరమణకు అంగీకరించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత అంతర్జాతీయ సరిహద్దు పరిధిలో ఉన్న మొత్తం మా దేశాన్ని(రష్యా ఆక్రమిత ప్రాంతాలను కలుపుకొని) నాటోలో చేర్చుకోవాలి. ఇలా చేస్తే రష్యా ఆక్రమించిన భూభాగాన్ని దౌత్యపరంగా దక్కించుకునే వీలు మాకు లభిస్తుందని'' జెలెన్‌స్కీ అన్నారు. Also Read: నెమ్మదించిన జీడీపీ...అయినా వేగంగా అభివృద్ధి కానీ తాను చెప్పిన ఈ సూచనను పరిగణలోకి తీసుకోవడం కష్టమేనని జెలెన్‌స్కీ తెలిపారు. ఇప్పటిదాకా నాటోలో ఏ దేశం కూడా తమకు ఈ రకమైన హామీ ఇవ్వలేదని చెప్పారు. మమ్మల్ని ఎవరైనా నాటోలో చేర్చుకుంటారా అనేది కూడా సందేహమే అని ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు. కేవలం తమ దేశంలో కొంత భాగాన్ని మాత్రమే చేర్చుకుంటామని చెప్పడం సరికాదని అన్నారు. ఉక్రెయిన్ అంటేనే తమ మొత్తం భూభాగమని, రష్యా భూభాగం వేరని చెప్పారు. Also Read: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడిక్కడే మృతి! పుతిన్ మళ్లీ రాకూడదు అంతేకాదు కాల్పుల విరమణకు రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ భూభాగాన్ని తన అధినంలోకి తీసుకునేందుకు మళ్లీ రాకూదనే గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇదిలాఉండగా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత రెండున్నరేళ్లుగా ఇరుదేశాల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల అమెరికా కూడ తమ మిసైల్స్‌ను వాడుకోవచ్చని పర్మిషన్ ఇవ్వడంతో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఈ దాడులను ఖండించిన రష్యా.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎప్పుడు ఆగుతుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇది కూడా చదవండి: రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు! #russia #ukraine #zelensky #international-news #russia-ukraine-war మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి