/rtv/media/media_files/2024/11/25/wsowajpng1RG5lCsUga2.jpg)
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ లో ప్రస్తుత జెలెన్ స్కీ ప్రభుత్వంతో చర్చలకు తాను విముఖంగా ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు.ఆ దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావాలని అభిప్రాయపడ్డారు.అప్పుడైతేనే యుద్ధం ముగింపునకు మార్గం సుగమం అవుతుందని సూచనప్రాయంగా పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌లో ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావాలి.అప్పుడైతే ఆ దేశంలో కొత్తగా ఎన్నికలు జరిగేందుకు వీలు లభిస్తుందన్నారు. అలా ప్రజల విశ్వాసంతో ఏర్పాటైన నూతన ప్రభుత్వంతో శాంతి పునరుద్ధరణకు చర్చలు జరపాలనుకుంటున్నాం. యావత్ ప్రపంచం గుర్తించే ఆ కొత్త ప్రభుత్వంతో యుద్ధం ముగింపునకు అవసరమైన చట్టబద్ధ పత్రాలపై సంతకం జరగాలి అని పుతిన్ వ్యాఖ్యానించారు.
Also Read: UAE: యూఏఈ జైళ్ల నుంచి 500 మందికి పైగా భారతీయుల విడుదల!
Russia-Ukrain War
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ...ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ త్వరలో చనిపోతాడని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధం నడుస్తోంది. త్వరలో పుతిన్ చనిపోగానే రష్యా, ఉక్రెయిన్ వార్ ఆగిపోతుందని జలెన్‌స్కీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. జెలెన్ స్కీ కామెంట్స్ సంచలనంగా మారాయి. రష్యా యుద్దం ఇంకా కొనసాగాలని కోరుకుంటుందని జెలెన్ స్కీ అన్నారు. శాంతి చర్చలు జరుగుతున్నప్పుటికీ రష్యా యుద్దాన్నే కోరుకుంటుందని ఆయన అన్నారు.
చాలా నెలలుగా పుతిన్ ఆరోగ్యంపై ఊహాగానాలు, పుకార్లు వస్తున్నాయి. పుతిన్ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన క్యాన్సర్‌తో పోరాడుతున్నారని ధృవీకరించని నివేదికలు కూడా ఉన్నాయి. రష్యా నాయకుడు నిరంతరం దగ్గుతున్నట్లు, ఆయన చేతులు, కాళ్ళు ఒణుకుతున్నట్లు కూడా వీడియోలు బయటకు వచ్చాయి. కానీ వాటినిపై పుతిన్ స్పందించలేదు. దీంతో పుకార్లకు మరింత బలం చేకూరింది.
ఇంధన లక్ష్యాలపై దాడులను 30 రోజుల పాటు నిలిపివేయడానికి ఉక్రెయిన్, రష్యా అంగీకరించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. గత వారం అమెరికా మధ్యవర్తిత్వం వహించిన సున్నితమైన కాల్పుల విరమణ ఉన్నప్పటికీ డ్రోన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వారం రష్యా 117 డ్రోన్ దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ పేర్కొంది. మూడు సంవత్సరాల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి జెలెన్స్కీ స్వస్థలమైన క్రివీ రిహ్ నగరం అతిపెద్ద డ్రోన్ దాడికి గురైంది. మరోవైపు, క్రిమియాలోని గ్యాస్ నిల్వ కేంద్రంపై, కుర్స్క్ మరియు బ్రయాన్స్క్ ప్రాంతాలలో ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేయడానికి ఉక్రెయిన్ ప్రయత్నించిందని రష్యా ఆరోపించింది. తొమ్మిది ఉక్రేనియన్ డ్రోన్‌లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది.
Also Read: Bill Gates: ఏఐ వచ్చినా..ఆ ఉద్యోగాలకు మాత్రం ఢోకా లేదు: బిల్ గేట్స్!
Also Read: Gold Rates-Trump: మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు..!
latest telugu news updates | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu | russia-ukraine-war