/rtv/media/media_files/2026/02/04/yamaha-2026-02-04-07-53-32.jpg)
Yamaha
ప్రస్తుతం చాలావరకు ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ బైక్స్,స్కీటీస్, కార్ల వాడకం రోజురోజుకు పెరుగుతోంది. అయితే తాజాగా మరో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ యమహా కూడా మంగళవారం తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈసీ06ని మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. బ్లూయిష్ వైట్ రంగులో ఉన్న స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ధరను రూ.1,67,000గా నిర్ణయించామని కంపెనీ పేర్కొంది.
Also Read: భారత్ అమ్ముల పొదిలో మరో ఆయుధం..‘ఎస్‌ఎఫ్‌డీఆర్’ పరీక్ష విజయవంతం
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఒకసారి ఫుల్‌ఛార్జ్ చేస్తే 169 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. ఎంపిక చేసిన నగరాల్లోని కంపెనీకి చెందిన బ్లూ స్క్వేర్ ప్రీమియం షోరూమ్‌లలో వీటిని కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. 4 కోలోవాట్ అవర్ బ్యాటరీతో వచ్చే ఈ స్కూటర్‌కు గంటకు గరిష్ట వేగం 79 కి.మీ వేగాన్ని, 26 టార్క్, 6.7 కిలోవాట్ పవర్‌ను అందిస్తుంది.
Also Read: ఉక్రెయిన్‌పై మళ్లీ విరుచుకుపడ్డ రష్యా.. 450 డ్రోన్లు, 70 మిసైళ్లతో దాడులు
రోజువారీ అవసరాలకు తగ్గట్లు ఈ స్కూటర్ సరిపోతుంది. దీని బ్యాటరీ మూడేళ్లు లేదా 30 వేల కిలోమీటర్ల వారెంటీతో వస్తుందని కంపెనీ తెలిపింది. సాధారణ హోమ్ ప్లగ్‌ఇన్ ఆప్షన్‌తో దీనికి సులభంగా ఛార్జింగ్ చేసుకోవచ్చని తెలిపింది. 8 గంటల్లోనే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం కార్బన్ న్యూట్రాలిటీ తగ్గించాలనే టార్గెట్‌కు అనుగుణంగా EV విభాగంలో అడుగుపెడుతున్నామని యమహా మోటార్ ఇండియా ఛైర్మన్ హజీమే అయోటా తెలిపారు. దీనికి కట్టుబడే ఈసీ06ను ప్రారంభించామని స్పష్టం చేశారు.
#BREAKING ➡️ Yamaha's FIRST electric scooter for India has been launched at ₹1.68 lakh (ex-showroom)
— carandbike (@carandbike) February 2, 2026
The Yamaha EC-06 is based on the River Indie, has the same 4 kWh battery, and a certified range of up to 169 km. Available in 'select cities'
Would you have this, or the Indie? pic.twitter.com/cZ7OZV47nK
Yamaha meets Electric like #nEVerbefore
— Yamaha Motor India (@India_Yamaha) February 2, 2026
Introducing the all-new Yamaha EC-06- Performance and precision to a new era of Electric Mobility.
Know more- https://t.co/5ftaSg2KPc#YamahaEC06#EC06#YamahaEV#ElectricRevolution#CallOfTheBlue#YamahaMotorIndiapic.twitter.com/iKmxkEBPB8
Follow Us