Switzerland : మూడోసారి ఉత్తమ దేశంగా స్విట్జర్లాండ్..33వ స్థానంలో భారత్

ఎప్పటిలానే అందమైన దేశంగా స్విట్జర్లాండ్ మరోసారి నిలిచింది. యూఎస్‌ న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌ విడుదల చేసిన బెస్ట్‌ కంట్రీస్‌ ర్యాంకింగ్‌ 2024లో స్విట్జర్లాండ్‌ అగ్రస్థానంలో ఉంటే భారతదేశం 33వ స్థానంలో ఉంది.

author-image
By Manogna alamuru
New Update
swiss

World Best Country - Switzerland :

అందమైన పర్వతాలు, పచ్చని ప్రకృతి...సొగసైన జలపాతాలు ఇలా స్విట్జర్లాండ్ చాలా అందంగా ఉంటుంది. ప్రపంచంలో అందరూ చూడాలనుకునే ప్రదేశం ఇది. దీనికి మించిన పర్యాటక ప్రదేశం ఉండదు. అందుకే మూడు ఏళ్ళుగా స్విట్జర్లాండ్ ప్రపంచ అత్యుత్తమ దేశంగా నిలుస్తోంది. యూఎస్‌ న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌ విడుదల చేసిన బెస్ట్‌ కంట్రీస్‌ ర్యాంకింగ్‌ 2024లో స్విట్జర్లాండ్‌ అగ్రస్థానం దక్కించుకుంది. చూడ్డానికి, ఉండడానికి చాలా చిన్న దేశం. కానీ అత్యంత సౌకర్యవంతమైన దేశం ఇది.

ప్రతీ ఏడాది యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ ప్రపంచ అత్యుత్తమ జాబితాలను రిలీజ్ చేస్తూ ఉంటుంది. సాహసం, వారసత్వం, వ్యాపార అవకాశాలు, జీవన నాణ్యత పరిమాణాలు, సంస్కృతి, సంప్రదాయాలు తదితర అంశాల ఆధారంగా చేపట్టి ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేస్తారు. ఈ ఏడాది మొత్తం 89 దేశాలతో జాబితాను రూపొందించారు. ఇందులోనే స్విస్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటివరకు ఈ దేశం ఏడుసార్లు నెంబర్ వన్ ర్యాంక్లో నిలిచింది. దీని తర్వాత జపాన్ రెండు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మన దేశం మాత్రం 33వ స్థానంలో ఉంది. గత ఏడాది కంటే భారత్ మూడు స్థానాలు కిందికి పడిపోయింది. ఆసియా నుంచి జపాన్‌, సింగపూర్‌, చైనా, దక్షిణ కొరియా మాత్రమే ఇప్పటివరకు టాప్‌ 25లో చోటు దక్కించుకోగలిగాయి.

Also Read :  గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిపై సీఎం సమీక్ష

Advertisment
Advertisment
తాజా కథనాలు