/rtv/media/media_files/2026/05/20/brics-2026-05-20-13-41-49.jpg)
World in flux, Putin and Xi likely to be in New Delhi for Brics Summit
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సుపై అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించనున్న ఈ 18వ బ్రిక్స్ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరవుతున్నట్లు రష్యా రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. అలాగే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా ఈ సదస్సుకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జిన్‌పింగ్ పర్యటన ఫిక్స్ అయితే జూన్ 2020 నాటి గాల్వన్ లోయ ఘర్షణలు, డిసెంబర్ 2022 నాటి తవాంగ్ సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి కానుంది. గతంలో రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సు వేదికగానే ప్రధాని మోదీ, జిన్‌పింగ్ చాలాకాలం తర్వాత మొదటిసారి సమావేశం కానున్నారు.
ఈ సదస్సుకు రష్యా, చైనా దేశాధినేతలు భారత్‌కు రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇది పరోక్షంగా షాక్ ఇచ్చినట్లే అవుతుంది. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సంక్షోభాలు, కీలక భౌగోళిక రాజకీయ అంశాలపై బ్రిక్స్ కూటమిలోని సభ్య దేశాల మధ్య అంతర్గత విభేదాలు కనిపిస్తున్నాయి. గత ఏప్రిల్ 24న న్యూఢిల్లీలో జరిగిన 11 సభ్య దేశాల డిప్యూటీ విదేశాంగ మంత్రులు, ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలోనే ఈ విభేదాలు బయటపడ్డాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం, ఇరాన్-UAE మధ్య ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్-పాలస్తీనా అంశంపై భారత్ ప్రతిపాదించిన కొన్ని పదాల మార్పులపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
Also Read: ఎబోలా వైరస్ డేంజర్ బెల్స్.. 134 మంది మృతి
జనవరి 2026లో బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ అంతర్గత విభేదాలను పరిష్కరిస్తూ కూటమిని ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ధ్రువాలుగా విడిపోతున్న ప్రస్తుత ప్రపంచ రాజకీయ ముఖచిత్రంలో బ్రిక్స్ ప్రాధాన్యతను కాపాడటం ఢిల్లీకి పెద్ద సవాలుగా మారింది. ఈ క్రమంలోనే "స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం" అనే నినాదంతోభారత్ ఈ ప్రతిష్టాత్మక 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తోంది.
Follow Us