/rtv/media/media_files/2025/03/03/YaJ4gCk7gzT05a1bdg43.jpg)
Shahzadi Khan
యూఏఈలో భారతీయ మహిళకు అక్కడి ప్రభుత్వం మరణశిక్ష అమలు చేసింది. ఓ చిన్నారి మృతి కేసులో ఈ శిక్ష విధించింది. ఫిబ్రవరి 15నే మరణశిక్ష అమలు చేసినప్పటికీ.. ఈ విషయాన్ని తాజాగా ఢిల్లీ హైకోర్టుకు విదేశాంగ శాఖ తెలిపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన షెహజాదీ ఖాన్ (33) అనే మహిళ టూరిస్టు వీసా మీద నాలుగేళ్ల క్రితం అబుదాబి వెళ్లింది. ఆ తర్వాత పనిలో చేరింది.
Also Read: రణవీర్ అల్హాబాదియా వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
అయితే 2022 ఆగస్టులో ఆమె యజమాని దంపతులకు కొడుకు పుట్టాడు. దీంతో అతను తన కొడకును చూసుకునే బాధ్యతను షెహజాదీ ఖాన్‌కు అప్పగించాడు. కేర్‌గివర్‌గా కింద ఆమె బాబును చూసుకనే బాధ్యతలు తీసుకుంది. ఆ చిన్నారికి ఆమె చాలాసార్లు వ్యాక్సినేషన్ వేయించింది. చివరికి ఆ బాబు 2022 డిసెంబర్ 7న మరణించాడు. దీంతో ఆ యజమాని షెహజాదీ ఖాన్‌పై కేసు పెట్టాడు. తన కొడుకు మరణానికి ఆమెనే కారణమంటూ ఫిర్యాదులో తెలిపాడు. ఆమె నేరాన్ని ఒప్పుకున్న వీడియో కూడా ఉంది. చివరికి కోర్టు ఆమెకు మరణశిక్ష ఖరారు చేసింది.
Also Read: రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ పోస్టు .. డిలీట్ చేసిన ముస్లిం మహిళా నేత!
విషయం తెలుసున్న షెహజాదీ కుటుంబ సభ్యులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వాళ్లు తమ కూతురిని చిత్రహింసలు పెట్టి బలవంతంగా నేరాన్ని ఒప్పుకునేలా చేశారని ఆరోపించారు. 2024 మే నెలలో షెహజాదీ తండ్రి క్షమాభిక్ష పిటిషన్ వేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. చివరికి 2025 ఫిబ్రవరి 15న యూఏఐలో ఆమెకు ఉరిశిక్షను అమలు చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ హైకోర్టుకు విదేశాంగ శాఖ తెలిపింది.
Also Read: ఛీ.. ఛీ మీరు మనుషులేనా.. నెల రోజుల చిన్నారికి 40 వాతలు పెట్టిన కుటుంబ సభ్యులు