Bangladesh: బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం.. అధ్యక్షుడిగా మహమ్మద్ యూనస్ ?

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్‌ తారిక్‌ రెహమాన్ ఆ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు అవుతారనేదానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. మాజీ ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్‌ యూనస్‌కు ఈ పదవి రావొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

New Update
Will Muhammad Yunus become Bangladesh President?

Will Muhammad Yunus become Bangladesh President?

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్‌ తారిక్‌ రెహమాన్ ఆ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు అవుతారనేదానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. మాజీ ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్‌ యూనస్‌కు ఈ పదవి రావొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. యూనస్‌ తాత్కాలిక ప్రభుత్వంలోని జాతీయ భద్రత సలహాదారుడిగా పనిచేసిన ఖలీలుర్ రెహమాన్.. ఇప్పుడు తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా చేరారు. ఆయన అక్కడ మంత్రిగా చేరడం తాత్కాలిక, కొత్త ప్రభుత్వాల మధ్య సంబంధాన్ని సూచిస్తోంది. 

Also Read: పాకిస్థాన్‌కు ఎండాకాలంలో 'జల'గండం.. రావి నదిపై గుప్పిట బిగించిన భారత్

బీఎన్‌పీ సీనియర్ నేత ఖండకర్ మొషారఫ్ హొస్సేన్‌కు ఈ పదవి ఇవ్వాలనే చర్చలు జరుగుతున్నప్పటికీ.. యూనస్‌ ఎంపికను కూడా ప్రజలు ఖండిచని పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు యూనస్‌కు పాశ్చత్య దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల చైనాకు కూడా ఆయన దగ్గరయ్యారు. ఒకవేళ యూనస్‌కు అధ్యక్ష పదవి ఇస్తే ఆయన దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా మారే అవకాశం కూడా ఉంది. అందుకే తారిక్ రెహమాన్ ఇందుకు అంగీకరిస్తాడా ? లేదా? అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. 

Also Read: శ్రీలంకలో ఎంపీల పెన్షన్లు రద్దు.. మరీ భారత్‌లో పరిస్థితి ఏంటి ?

ఇటీవల బంగ్లాదేశ్‌లో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా  'జూలై చార్టర్' ఆమోదం పొందింది. ఈ చార్టర్ అధ్యక్షుడి అధికారాలను పెంచాలని సూచిస్తుంది. అంటే గతంలో ఇది నామమాత్రపు పదవిగానే ఉండేది. కానీ ఇప్పుడు కొన్ని కీలక నిర్ణయాల్లో ఆయనకు కూడా స్వతంత్ర హోదా లభించేలా మార్పులు చేయాలని నిర్ణయించారు. ఒకవేళ యూనస్ అధ్యక్షుడైతే.. ఈ చార్టర్‌ ప్రకారం ఆయనకు కూడా అధికారాలు వస్తాయి. దీంతో తారిక్ రెహమాన్ ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలకు యూనస్ అడ్డుపడొచ్చు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్ షహబుద్దీన్ పదవీకాలం 2028 ఏప్రిల్ వరకు ఉంది. అయినప్పటికీ ఆయన తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలే చెప్పారు.    

Advertisment
తాజా కథనాలు