/rtv/media/media_files/5dyxETW11Lf8Kw3GrPRf.jpg)
Mynmar Earthquake: మయన్మార్ లో భూకంపం అక్కడి ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసేసింది. ఒక్కసారిగా మీద వచ్చి పడిన విపత్తుతో జనం చెల్లాచెదురు అయిపోయారు. వందల్లో ప్రాణాలు పోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మయన్మార్, బ్యాంకాక్ తో సహా చైనా, భారత్, వియత్నాం మరికొన్ని తూర్పు ఆసియా దేశాల్లో భారీ భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేల్ పై 7.7, 6.4 తీవ్రతతో రెండు సార్లు భూమి కంపించింది. అన్నిటి కంటే ఎక్కువగా థాయ్ లాండ్, మయన్మార్ దేశాలు ప్రభావితం అయ్యాయి. భారీగా ఇక్కడ భవనాలు నేలమట్టం అయ్యాయి. మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.
Also Read: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !
సగాయింగ్ ఫాల్ట్..
భూకంపాలు ఎక్కువగా వచ్చే దేశాల్లో మయన్మార్ ఒకటి. ఇక్కడి భూగర్భంలో ‘‘టెక్టానిక్ ప్లేట్స్’’ క్రియాశీలత ఎక్కువగా ఉంది. భూకంప కేంద్రం సరిగ్గా మయన్మార్ కు మధ్యలో ఉంది. ఇది సగాయింగ్ ఫాల్ట్ దగ్గరలో ఉంది. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా మైక్రోప్లేట్‌ల మధ్య ఉన్న ప్రాంతాన్నే సగాయింగ్ ఫాల్ట్ అంటారు. మయన్మార్ లో ఉన్న ఉన్న ఒక నగరం పేరు మీద దీన్ని ఇలా వ్యవహరిస్తున్నారు. భూమి పొరల అమరికల్లో తేడాలుండడాన్నే ఫాల్ట్ అంటారు. మయన్మార్ లో ఇది చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 1200 కిలో మీటర్ల మేర విస్తరించి ఉందని చెబుతున్నారు.
Also Read: కాపాడండి ప్లీజ్ అంటూ కార్మికుల ఆర్తనాదాలు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియోలు
భూగర్భం పోరల అమరికల వల్ల రెండు భూభాగాలు ఒకదానికి ఒకటి తగులూతూ ఉంటాయి. ఏడాదికి 11 మి.మీ నుంచి 18 మి.మీ వేగంగా జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇందులో 18 మి.మీ అంటూ చాలా ఎక్కు వని చెబుతున్నారు. ఇవి దీర్ఘకాలం కొనసాగుతుండటం, కాలక్రమేణా భూగర్భంలో ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా భూకంపానికి దారితీస్తుంది. ఇది మరీ ఎక్కువైతే భూమి పైన పగుళ్లు కూడా ఏర్పడతాయి. టెక్టానిక్ ప్లేట్ల మధ్య ఘర్షణ కారణంగానే తరుచూ భూకంపాలు వస్తుంటాయి. ఇంతకు ముందు కూడా సగాయింగ్ ఫాల్క్ కారణంగా మయన్మార్ లో చాలా భూకంపాలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఎప్పుడూ 6 కంటే ఎక్కువ తీవ్రత ఉన్న భూకంపాలే ఏర్పడుతున్నాయి. 1946లో 7.7 తీవ్రతతో రాగా.. 1956లోనూ 7.1 తీవ్రతతో భూమి కంపించింది. 1988లో షాన్‌లో, 2004లో కోకో ద్వీపంలో వచ్చిన బలమైన ప్రకంపనలతో వందలాది మంది చనిపోయారు. 2011లో టార్లేలో వచ్చిన భూకంపంలో 151 మంది ప్రాణాలు కోల్పోయారు, 2016లోనూ 6.9 తీవ్రత భూమి కంపించింది. ఇప్పుడు తాజాగా మయన్మార్ లో ఈరోజు 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇందులో వందల మంది ప్రాణాలు పోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: భూకంపం ఎఫెక్ట్.. 100 దాటిన మృతుల సంఖ్య
today-latest-news-in-telugu | earth-quake
Also Read: Delhi: రెస్టారెంట్లపై ఢిల్లీ హైకోర్టు మండిపాటు..సర్వీస్ ఛార్జీలపై ఆదేశాలు