/rtv/media/media_files/2025/01/02/NTCcnD63nclSaZnCrZsB.jpg)
Attack in USA
కొత్త సంవత్సరం వేడుకల వేళ.. అమెరికాలో పేలుడు, కాల్పులు జరగడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. న్యూ ఆర్లీన్స్‌లో న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఓ దుండగుడు వేగంగా వాహనంలో దూసుకొచ్చి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. అయితే దీనికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ తాజాగా విడుదలయ్యాయి. రోడ్డుపై జనాలు వెళ్తుండగా.. ఒక్కసారిగా వాహనం వేగంగా దూసుకెళ్లింది. రోడ్డుపై వెళ్తున్న వాళ్లలో ఈ దాడి నుంచి తప్పించుకోగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మందికి గాయాలయయ్యాయి.
Also Read: ఒకే రోజు 16 సూర్యోదయాలు చూసిన సునీతా విలియమ్స్
అయితే ఈ దాడి వెనుక ఉగ్రకోణం ఉందని అమెరికా అనుమానిస్తోంది. దాడికి ఉపయోగించిన ట్రక్కులో ISIS జెండా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అలాగే నిందితుడు షంసుద్దీన్ జబ్బార్‌గా గుర్తించారు. ఇతడు ఐసిస్ ఉగ్రవాదిగా భావిస్తున్నారు. అయితే షంషుద్దీన్ జబ్బార్ న్యూ ఆర్లిన్‌లో దాడి చేస్తాడని కొన్ని గంటల ముందే FBI వద్ద సమాచారం ఉన్నట్లు అధ్యక్షుడు జోబైడెన్ చెప్పినట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. అంతేకాదు జబ్బార సోషల్ మీడియాలో ఐసిస్‌కు అనుకూలంగా పోస్టు చేసి.. హింసకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చినట్లు పేర్కొంది. అయితే జబ్బర్‌ను ఐసిస్ లోన్ ఉల్ఫ్‌గా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
New horrific video of the terrorist attack in New Orleans, look at how fast that SOB was going when he targeted people on the street pic.twitter.com/bYbGGSrxyr
— Vince Langman (@LangmanVince) January 1, 2025
Shamsud Din Jabbar was able to plow onto Bourbon Street from Canal Street in New Orleans, in his pickup truck with an ISIS flag, because the steel barriers weren’t raised.
— Paul A. Szypula 🇺🇸 (@Bubblebathgirl) January 1, 2025
Government officials need to be fired and indicted for this gross incompetence.pic.twitter.com/aMHmA05aLT
ఒక టెర్రరిస్టు గ్రూపు నుంచి ప్రభావితమై చిన్న గ్రూపుల లేదా ఒంటరిగా దాడులు చేసిన వాళ్లని లోన్ ఉల్ఫ్‌గా పిలుస్తారు. అమెరికాలో ఈ మధ్యకాలంలో జరుగుతున్న చాలావరకు ఉగ్రదాడులు కూడా ఈ రూపంలోనే జరుగుతున్నాయి. ఒకసారి 2014లో బెల్జియంలో యూదుల మ్యూజియంపై, అలాగే 2016లో ఫ్రాన్స్‌లో బాస్టిల్ డే రోజున ట్రక్కతో ఇలాంటి దాడులే జరిగాయి.
మరోవైపు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ హోటల్ బయట టెస్లా కారులో పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురు క్షతగాత్రుయ్యారు. కారులో ఉన్న పేలుడు పదార్థాల వల్లే ఈ దారుణం జరిగిందన అధికారులు చెబుతున్నారు. అలాగే న్యూయర్క్‌లోని క్వీన్స్ కౌంటీకి చెందిన అమజురా నైట్‌క్లబ్‌లో ఈ కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో 11 మంది గాయాలపాలైనట్లు పోలీసులు తెలిపారు.