USAID: 5200 కార్యక్రమాలకు యూఎస్‌ ఎయిడ్ నిధులు నిలిపివేత

అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో కీలక ప్రకటన చేశారు. యూఎస్‌ ఎయిడ్ సంస్థ ద్వారా అంతర్జాతీయంగా చేపడుతున్న వేలాది కార్యక్రమాలకు ముగింపు పలకనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 5200 కార్యక్రమాలకు రద్దు చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.

New Update
USAID

USAID

అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో కీలక ప్రకటన చేశారు. యూఎస్‌ ఎయిడ్ సంస్థ ద్వారా అంతర్జాతీయంగా చేపడుతున్న వేలాది కార్యక్రమాలకు ముగింపు పలకనున్నట్లు పేర్కొన్నారు. కేవలం కొన్ని కార్యక్రమాలకు మాత్రమే విదేశాంగ శాఖ ఆర్థిక సాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు. దీనిపై ఆరు వారాల పాటు జరిగిన సమీక్ష తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం 5200 కార్యక్రమాలకు రద్దు చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. 

Also Read: సిరియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. అంతర్యుద్ధానికి కారణం ఏంటి ?

'' యూఎస్‌ ఎయిడ్‌లోని 83 శాతం కార్యక్రమాలకు అధికారికంగా ముగింపు చెప్పుతున్నాం. మొత్తం 5200 కాంట్రాక్టులను రద్దు చేసేశాం. ఇప్పటిదాకా వేలాది కోట్ల డాలర్లు ఖర్చు చేశాం. దీనికి ఎలాంటి ఫలితం దక్కలేదు. కొన్ని సందర్భాగల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. మాకు అమెరికా జాతీయ ప్రయోజనాలే ముఖ్యం. ఈ సంస్కరణల కోసం తీవ్రంగా శ్రమించిన డోజ్ సిబ్బందికి ధన్యవాదాలు చెబుతున్నామని'' మార్క్‌ రుబియో ఎక్స్‌లో రాసుకొచ్చారు. కాంగ్రెస్‌లో సంప్రదింపుల తర్వాత మిగిలిన కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.  

Also Read: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్‌ట్విస్ట్.. ప్రముఖ వ్యాపార వేత్త అరెస్ట్

ఇదిలాఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించాక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తు్నారు. ఈ క్రమంలోనే యూఎస్‌ ఎయిడ్‌ ప్రక్షాళన చేపట్టారు. ఇందులో భాగంగానే అంతర్జాతీయ కార్యక్రమాలకు అందజేస్తున్న నిధులను తాత్కాలికంగా నిలిపివేశారు. అంతేకాదు వాటికోసం పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులను కూడా తీసేశారు. అయితే ట్రంప్‌ నిధుల సాయం ఆపివేయడంతో పలు న్యాయస్థానాల్లో దావాలు నమోదవుతున్నాయి.  

Also Read: H1B వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లకి బిగ్‌ షాక్.. రావడం కష్టమే

Also Read: పన్నులు తగ్గించాలని అడగొద్దు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు