/rtv/media/media_files/2026/04/24/us-soldier-2026-04-24-18-18-55.jpg)
US soldier used secret Maduro raid intel to place bets to win $400,000
ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్బంధం గురించి ముందుగానే తెలుసుకున్న అమెరికా సైనికుడు పందెం వేసి 4 లక్షల డాలర్లు (రూ.3 కోట్లు) గెలుచుకున్నాడు. అతడు చేసిన నిర్వాహం వెలుగులోకి రావడంతో తాజాగా అమెరికా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది జనవరిలో వెనెజువెలాపై దాడులు చేసిన అమెరికా.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ను బంధించి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
Also Read: అమెరికా వెళ్లాలనుకునేవారికి బిగ్ షాక్.. H1 బీ వీసా మూడేళ్లు రద్దు !
నికోలస్‌ను నిర్బంధించే ఆపరేషన్‌లో గ్యానన్ కెన్ వాన్ డైక్ అనే సైనికుడు కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే ఆయన నిర్బంధానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ముందుగానే తెలుసుకొని.. ప్రిడిక్షన్ మార్కెట్‌లో బెట్టింగ్ పెట్టాడు. పాలీమార్కెట్ అనే సైట్‌లో మదురో నిర్బంధంపై ఆ అమెరికా సైనికుడు పందెం వేశాడు. చివరికి ఇందులో అతడు 4 లక్షల డాలర్లు ( రూ.3కోట్లకు పైగా) ప్రైజ్‌మనీని గెలుచుకున్నాడు. అనంతరం ఈ నిధులను క్రిప్టో కరెన్సీ ద్వారా మళ్లించాడు. చివరికి ఈ విషయం అధికారులకు తెలియడంతో అతడిని అరెస్టు చేశారు. అతడిపై పలు అభియోగాలు మోపి విచారణ చేస్తున్నారు.
Follow Us