/rtv/media/media_files/2026/04/25/trump-2026-04-25-10-09-12.jpg)
Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై వర్చువల్‌గా సంతకాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ.. ఒకవేళ భవిష్యత్తులో ఆ దేశం మాట తప్పినా లేదా ఈ ఒప్పందం తనకు నచ్చకపోయినా.. మళ్లీ సైనిక దాడులు చేస్తామని హెచ్చరించారు. పారిస్ పర్యటనలో భాగంగా ట్రంప్ మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కుదిరిన ఈ 14 సూత్రాల ఒప్పందం తాత్కాలికమైనదన్నారు. అయితే ఇరాన్ తన ప్రవర్తనను మార్చుకోకపోతే మళ్లీ దూకుడు ప్రదర్శిస్తామని అమెరికా వెల్లడించింది.
ఇది కూడా చూడండి: Indo-Pacific Command : భారత్‌కు షాకిచ్చిన అమెరికా : 'ఇండో' పదం తొలగింపు, వివాదాస్పద మ్యాప్..
POTUS on Iran abiding by the terms of the agreement: "When I say permanently, it should be permanently— but if it's not permanently, we will bomb them."
— Major Anthony Jones (@majorbrainpain) June 18, 2026
🇺🇸Join👉 @SGTnewsnetwork9pic.twitter.com/jsNXivbvcQ
ఇదిలా ఉండగా.. అమెరికాలో ప్రతిపక్షాలు, కొంతమంది రక్షణ నిపుణులు ఇరాన్‌తో ఒప్పందం చేసుకోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇరాన్‌ను నమ్మడం వల్ల అమెరికా ప్రయోజనాలు దెబ్బతింటాయని అంటున్నారు. ఈ విమర్శలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ ఒప్పందం వల్ల అమెరికా కోల్పోయేదేమీ లేదని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా హోర్ముజ్ జలసంధిని తక్షణమే తెరిపించగలిగామని తెలిపారు. ఈ హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన మార్కెట్లకు చాలా అవసరం. అలాగే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలో ఉంచేలా ఒప్పించాం. అసలు ఇందులో అమెరికాకు నష్టం ఎక్కడుందని ట్రంప్ ప్రశ్నించారు. ఈ ఒప్పందం వల్ల ఇరు దేశాల మధ్య యుద్ధం తగ్గిందని, శాంతి నెలకొందన్నారు.
ఇది కూడా చూడండి: Russia-India: ప్రపంచాన్ని శాసించే అరుదైన లోహాలు.. రష్యాతో భారత్ సీక్రెట్ డీల్!
ఈ అవగాహన ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి శాశ్వత ఒప్పందం కుదరడానికి 60 రోజుల సమయం ఉంది. ఈ గడువును ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. ఈ 60 రోజులు ఇరాన్‌కు ఒక పరీక్షా సమయం లాంటిదని అన్నారు. ఇరాన్ గనుక అణు కార్యక్రమాలను ఆపకుండా, ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తూ తన పాత బుద్ధిని చూపిస్తే ఈ ఒప్పందాన్ని అక్కడికక్కడే రద్దు చేస్తానని హెచ్చరించారు. ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. వచ్చే రెండు నెలల్లో ఇరాన్ మంచిగా ప్రవర్తిస్తే వారికి ఆర్థికంగా ఆంక్షల నుండి ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ నాకు ఈ ఒప్పందంలో ఏదైనా నచ్చకపోతే, వెంటనే దీన్ని రద్దు చేసి మళ్లీ దాడులు మొదలుపెడతామని.. ఇరాన్ ఈ విషయాన్ని గుర్తించుకోవాలని ట్రంప్ తెలిపారు.
ఇది కూడా చూడండి: Meenakshi Natarajan Case : రిటర్నింగ్ అధికారి vs ప్రజాస్వామ్యం
Follow Us