Iran-America War: ఇరాన్ పైకి అమెరికా డ్రోన్ స్పీడ్ బోట్లు.. అవి చేసే విధ్వసం ఎంతో తెలుసా?

మిడిల్‌ఈస్ట్‌లో యుద్ధం కొనసాగుతున్న యుద్ధం 30 రోజులకు చేరింది. ఇప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా మరో కీలక అస్త్రాన్ని బరిలోకి దింపింది.

New Update
US Navy deploying unmanned drone boats for surveillance in operations against Iran

US Navy deploying unmanned drone boats for surveillance in operations against Iran

మిడిల్‌ఈస్ట్‌లో యుద్ధం కొనసాగుతున్న యుద్ధం 30 రోజులకు చేరింది. ఇప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా మరో కీలక అస్త్రాన్ని బరిలోకి దింపింది. గల్ఫ్‌ సముద్ర మార్గాల్లో పహారా కోసం మొదటిసారిగా మానవరహిత డ్రోన్‌ స్పీడ్‌బోట్లను మోహరించింది. ఈ విషయాన్ని పెంటగాన్ అధికారికంగా వెల్లడించింది. ఇప్పటివరకు ఈ సమాచారాన్ని అమెరికా రహస్యంగా ఉంచి తాజాగా బయటికి చెప్పడంతో యుద్ధ వ్యూహాలు మారనున్నట్లు తెలుస్తోంది.  

అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు చేస్తుండగా ఇరాన్‌ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రతీకార దాడులతో విరుచుకుపడుతోంది. అమెరికాకు చెందిన పలు యుద్ధ విమానాలను కూడా ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌ను నిలువరించేందుకు అమెరికా ఈ కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తోంది. ఇరాన్ కార్యక్రమాలను అడ్డుకోవడం, సముద్ర జలాల్లో నిఘా సిస్టమ్‌ను మరింత పటిష్ఠం చేసేందుకు తొలిసారిగా మానవరహిత డ్రోన్‌ స్పీడ్‌బోట్లను దించామని అమెరికా రక్షణ శాఖ తెలిపింది. అత్యంత వేగంతో వెళ్లే ఈ బోట్లు శత్రువుల కదలికలను తేలికగా పసిగడతాయని పేర్కొంది. గతంలో ఇలాంటి స్పీడ్‌బోట్లను ఉక్రెయిన్‌ కూడా వాడి రష్యాపై దాడులకు పాల్పడింది. 

Also Read: గ్యాస్‌, పెట్రోల్‌ కొరతను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం.. కిరోసిన్ పంపిణీ ప్రారంభం

 బ్లాక్‌సీ అనే సంస్థ 'గ్లోబల్ అటానమస్ రికనైసెన్స్ క్రాఫ్ట్' (జీఏఆర్‌సీ) అనే డ్రోన్‌ స్పీడ్‌బోట్లను రూపొందించింది. దాదాపు 5 మీటర్ల పొడవు ఉండే ఈ బోట్లు ఆత్మాహుతి దాడులు చేసేందుకు కూడా రెడీగా ఉంటాయి. ఇప్పటికే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా అమెరికా 2200 నాటికల్ మైళ్ల వరకు నిఘా నిర్వహించినట్లు పెంటగాన్ అధికారులు వెల్లడించారు. దాదాపు 450 గంటల పాటు ఇవి నిర్వీరామంగా గస్తీ కాసినట్లు పేర్కొన్నారు. చమురు ట్యాంకర్లపై ఇరాన్‌ డ్రోన్ దాడులు చేస్తున్న క్రమంలో వాటిని అడ్డుకునేందుకు అమెరికా ఈ స్పీడ్‌ బోట్లను వినియోగిస్తోంది. 

ఈ డ్రోన్‌ స్పూడ్ బోట్‌లో వైఫల్యాలు కూడా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా మానవరహిత డ్రోన్‌ బోట్లను తయారుచేసేందుకు అమెరికా యత్నిస్తున్నా ఆశించినంత స్థాయిలో రిజల్ట్ రావడం లేదు. గతేడాది నిర్వహించిన పరీక్షల్లో ఓ స్పీడ్‌బోట్‌ మరో బోట్‌ను ఢీకొంది. తాజాగా పశ్చిమాసియాలో నిర్వహించిన పరీక్షలో ఓ స్పీడ్‌బోట్ పనిచేయలేదు. ఇలా కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నప్పటికీ.. ఇలాంటి చౌక డ్రోన్ బోట్లు అవసరం అవుతాయని అమెరికా భావిస్తోంది. 

Also Read: మొజ్తబా ఖమేనీ నుంచి మరో కీలక సందేశం.. ఇరాక్‌ ప్రజలకు ధన్యవాదాలు

ఇదిలాఉండగా ఇటీవల ట్రంప్ ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై, ఇంధన మౌలిక సదుపాయలపై 10 రోజుల వరకు దాడులు చేయమని ప్రకటించారు. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ట్రంప్ పెట్టిన ఈ గడువు ఏప్రిల్ 6, రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉండనుంది. ఇరాన్ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శాంతి చర్చలకు మరింత సమయం ఇస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ కూడా మిగిలిన సైనిక లక్ష్యాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్‌ కూడా గల్ఫ్‌ దేశాల్లో దాడులు చేస్తూనే ఉంది. 

Advertisment
తాజా కథనాలు