Trump: బైడెన్ నాలుగేళ్లలో చేసింది.. ట్రంప్ ఏడాదిలోనే చేశాడు.. ప్రపంచాన్ని వణికించే రిపోర్ట్!

ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం నుంచి ఇతర దేశాల్లో జోక్యం చేసుకునేవరకు దూకుడు ప్రదర్శిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ నాలుగేళ్ల పాలనలో కన్నా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఒక్క ఏడాదిలోనే ఎక్కువగా వైమానిక, డ్రోన్‌ దాడులు చేశారు.

New Update
US launches more foreign strikes in Trump's first year than during Biden presidency: survey

US launches more foreign strikes in Trump's first year than during Biden presidency: survey

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం నుంచి ఇతర దేశాల్లో జోక్యం చేసుకునేవరకు దూకుడు ప్రదర్శిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ నాలుగేళ్ల పాలనలో కన్నా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఒక్క ఏడాదిలోనే ఎక్కువగా వైమానిక, డ్రోన్‌ దాడులు చేశారు. దీనికి సంబంధించి  ఆర్మ్డ్‌ కాన్ఫ్లిక్ట్‌ లొకేషన్ అండ్ డేటా ప్రాజెక్ట్ (ACLED) అనే సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. 

Also Read: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో వివాదం.. సిరాకు బదులు మార్కర్‌ పెన్నులు

ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 20,2025 నుంచి జనవరి 5, 2026 వరకు అమెరికా విదేశాలపై మొత్తంగా 573 వైమానిక, డ్రోన్‌  దాడులు చేసింది. కానీ బైడెన్ నాలుగేళ్ల పాలనలో కేవలం 494 దాడులు మాత్రమే జరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇక గత 12 నెలల్లో కనీసం 9 దేశాల్లో 1008 విదేశీ సైనిక కార్యకలు జరిగాయి. ఈ దాడుల్లో 1093 మరణించారు. బైడన్‌ పాలనలో 1648 ఆపరేషన్లు జరగగా 1518 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Also Read: అణ్వాయుధాలను దాచిన ఇరాన్..ఆ ధైర్యంతోనే అమెరికాకు సవాల్

ట్రంప్ పాలనలో కరేబియన్ సముద్రం, తూర్పు పసిఫిక్‌లో అమెరికా దళాలు జరిపిన కాల్పుల్లో 110 మంది మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులు ఉన్నారు. జూన్‌లో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయగా ఇందులో ఎంతమంది మరణించారనేది క్లారిటీ లేదు. అయితే 2025 జనవరి నుంచి డిసెంబర్‌ మధ్య యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులపై 80 శాతానికి పైగా దాడులు జరిగాయని ACLED తెలిపింది. దీని ఫలితంగా 530 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.   

Advertisment
తాజా కథనాలు