పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడులు

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలైంది. ఇరాన్‌పై అమెరికా మళ్లీ దాడులకు పాల్పడుతోంది. ఈ విషయాన్ని అమెరికా కేంద్ర సైనిక దళం అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేపట్టింది.

New Update
Trump

Trump

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలైంది. ఇరాన్‌పై అమెరికా మళ్లీ దాడులకు పాల్పడుతోంది. ఈ విషయాన్ని అమెరికా కేంద్ర సైనిక దళం అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేపట్టింది. అధునాతన క్షిపణులు, డ్రోన్ల సహాయంతో ఇరాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలను, కీలక సైనిక స్థావరాలను అమెరికా దళాలు ధ్వంసం చేస్తున్నాయి. దీనిపై అమెరికా స్పందిస్తూ.. ఇరాన్ గత కొంతకాలంగా అనుసరిస్తున్న దూకుడు వైఖరి వల్లే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.

ఇది కూడా చూడండి: Ireland: : ఐర్లాండ్‌లో అల్లర్లు.. వలసదారులను లక్ష్యంగా చేసుకున్న హింస

తగిన బుద్ధి చెప్పడమే..

ఇరాన్ చేస్తున్న రెచ్చగొట్టే చర్యలకు తగిన సమాధానం చెప్పడమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని అమెరికా సైన్యం స్పష్టం చేసింది. ఈ దాడుల కంటే ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్‌లో విలేకర్లతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ అకృత్యాలను సహించేది లేదని హెచ్చరించారు. అవసరమైతే ఇరాన్‌పై మరింత తీవ్రమైన దాడులు చేస్తామని ఆయన బహిరంగంగానే పేర్కొన్నారు. అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే అమెరికా ఇరాన్‌పై దాడులకు పాల్పడింది. 

ఇది కూడా చూడండి: Neethu Bhai : ఐటీ కారిడార్‌లో ‘గంజాయి సామ్రాజ్యం’.. మరోసారి తెరమీదకు "నీతూబాయ్'

Advertisment
తాజా కథనాలు