/rtv/media/media_files/2026/04/13/us-kc-135-2026-04-13-16-00-22.jpg)
Viral Video: ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న అమెరికాకు చెందిన KC-135 స్ట్రాటోట్యాంకర్ యుద్ధ విమానం బ్రిటన్‌లోని ఒక వైమానిక స్థావరంలో ప్రత్యక్షమవ్వడం సంచలనం సృష్టిస్తోంది.
అమెరికా గర్వవృక్షానికి భారీ గాయం!
సుమారు 60 ఏళ్లుగా అమెరికా వైమానిక దళంలో వెన్నెముకగా ఉన్న ఈ విమానం, గాలిలో ఉన్న జెట్ ఫైటర్లకు ఇంధనాన్ని సరఫరా చేసే అత్యంత కీలకమైన 'ట్యాంకర్'. ఇటీవల పశ్చిమ ఆసియా నుంచి బయలుదేరి యూకేలోని స్థావరానికి చేరుకున్న ఈ ఫ్లైట్ బాడీ అంతా తూటాల రంధ్రాలతో నిండిపోయి ఉంది. విమానం ముందు నుంచి తోక వరకు ప్రతి భాగం ధ్వంసమై ఉన్న దృశ్యాలను చూసి రక్షణ రంగ నిపుణులు షాక్ అవుతున్నారు.
Also Read: ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా..? 90's కుర్రాళ్ల కలలరాణి.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి
⚡🇺🇸 A battle-damaged USAF KC-135 tanker has been spotted limping back from the Middle East, its fuselage scarred with patched shrapnel holes clear signs of a strike it somehow survived.
— Defense Signal (@defensesignal) April 12, 2026
Reports indicate it could be among the aircraft hit during the Iranian missile and drone… pic.twitter.com/5JqgrBluKY
ప్రిన్స్ సుల్తాన్ స్థావరంపై ఇరాన్ ప్రతాపం
గత నెలలో సౌదీ అరేబియాలోని అమెరికా ప్రధాన స్థావరమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై ఇరాన్ జరిపిన దాడిలోనే ఈ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, ఈ దాడిలో కేవలం ఒక విమానం మాత్రమే కాదు, సుమారు ఐదు KC-135 ట్యాంకర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గగనతల నిఘాలో కీలకమైన AWACS విమానాన్ని కూడా తాము కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. శాటిలైట్ ఫొటోలను నిరోధించడంతో ఈ నష్టాన్ని ప్రపంచానికి తెలియకుండా అమెరికా జాగ్రత్త పడినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా కేవలం ఒకటి లేదా రెండు విమానాలకు మాత్రమే స్వల్ప నష్టం జరిగిందని చెబుతున్నప్పటికీ, బయటపడిన ఈ వీడియో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.
Also Read: రక్తంతో తడిసి ముద్దైన రోడ్లు.. యాక్సిడెంట్‌లో 18 మంది మృతి
యుద్ధం మిగిల్చిన చేదు నిజం
ఇరాన్ నేరుగా అమెరికా ప్రధాన భూభాగంపై దాడి చేయలేకపోయినా, పక్క దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను సమర్థవంతంగా లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ దాడులు అమెరికా రక్షణ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతున్నాయి. "ట్రంప్ ప్రభుత్వం ఈ నష్టాన్ని అంగీకరించకపోయినా, దెబ్బతిన్న ఈ జంబో విమాన చిత్రం ఇరాన్ శక్తిని, అమెరికా ఎదుర్కొంటున్న అపారమైన నష్టాన్ని కళ్లకు కడుతోంది."
ప్రస్తుతం దెబ్బతిన్న ఈ విమానానికి మరమ్మతులు జరుగుతున్నాయి, కానీ ఇది మళ్ళీ విధుల్లోకి చేరడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ పరిణామాలు పశ్చిమ ఆసియాలో యుద్ధం ఇరు దేశాలకూ తీరని నష్టం కలిగిస్తోందని స్పష్టం చేస్తున్నాయి.
Follow Us