/rtv/media/media_files/2026/04/12/iran-2026-04-12-09-30-28.jpg)
America-Iran
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం నెలకొంది. డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని ముగించడానికి చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో 14 సూత్రాలతో ఈ ఒప్పందం జరిగింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని వర్సయ్స్ ప్యాలెస్‌లో ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో జరిగిన సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. అదే సమయంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కూడా డిజిటల్ పద్ధతిలో దీనిని ఆమోదించారు. ఇరుపక్షాలు సంతకాలు చేసిన వెంటనే ఈ ఒప్పందం అధికారికంగా అమలులోకి వచ్చింది.
ఇది కూడా చూడండి: Russia-India: ప్రపంచాన్ని శాసించే అరుదైన లోహాలు.. రష్యాతో భారత్ సీక్రెట్ డీల్!
Iranian President Dr. Masoud Pezeshkian Signs "Islamabad" Memorandum of Understanding
— Breaking X (@BreakingXAlerts) June 18, 2026
The text of the memorandum of understanding was signed in the first minutes of dawn on Thursday, Khordad 28, 1405 (corresponding to June 18, 2026), by the presidents of Iran and the United… pic.twitter.com/kLwVOvdtfE
ఇది కూడా చూడండి: Indo-Pacific Command : భారత్‌కు షాకిచ్చిన అమెరికా : 'ఇండో' పదం తొలగింపు, వివాదాస్పద మ్యాప్..
ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని 'అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం'గా పిలుస్తున్నారు. దీని ప్రకారం ఇరు దేశాలు, వాటి మిత్రదేశాలు లెబనాన్‌తో సహా అన్ని ప్రాంతాలలో సైనిక చర్యలను తక్షణమే శాశ్వతంగా నిలిపివేయాలి. ఒకరిపై ఒకరు యుద్ధానికి దిగకూడదని, అలాగే లెబనాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని నిర్ణయించుకున్నాయి. ఈ తాత్కాలిక ఒప్పందం జరిగిన 60 రోజుల్లోపు పూర్తిస్థాయి శాశ్వత ఒప్పందంపై చర్చలు ముగించాలని ఇరుదేశాలు గడువు పెట్టుకున్నాయి.
ఇది కూడా చూడండి: Meenakshi Natarajan Case : రిటర్నింగ్ అధికారి vs ప్రజాస్వామ్యం
ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని తక్షణమే తిరిగి తెరవడం ఈ ఒప్పందంలో ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో ఎక్కువ భాగం ఈ మార్గం గుండానే వెళ్తుంది. రాబోయే 60 రోజుల పాటు వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణానికి ఇరాన్ ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా అనుమతి ఇస్తుంది. అమెరికా ఇరాన్‌పై విధించిన నావికా దిగ్బంధనాన్ని, సముద్ర రవాణాపై ఉన్న ఆంక్షలను 30 రోజుల్లోపు పూర్తిగా ఎత్తివేయడం ప్రారంభిస్తుంది.
ఇరాన్‌ను ఆర్థికంగా ఆదుకోవడానికి అమెరికా ఒక భారీ ప్యాకేజీని ప్రకటించింది. యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి కోసం అమెరికా తన ప్రాంతీయ భాగస్వామ్య దేశాలతో కలిసి కనీసం 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 25 లక్షల కోట్లు) ఇవ్వనుంది. అమెరికా గతంలో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను, బ్యాంకు నిధులను తిరిగి విడుదల చేయడానికి అంగీకరించింది. ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై ఉన్న ఆంక్షల నుంచి యుఎస్ ట్రెజరీ విభాగం తక్షణమే మినహాయింపులు ఇవ్వనుంది.
ఇది కూడా చూడండి: Today Horoscope: నేడు ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఆ రాశులేవంటే?
అలాగే ప్రపంచ దేశాలను వేధిస్తున్న ఇరాన్ అణు కార్యక్రమంపై కూడా ఈ ఒప్పందంలో స్పష్టత ఇచ్చింది. తాము ఎలాంటి అణ్వాయుధాలను తయారు చేయబోమని, సేకరించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ వద్ద ప్రస్తుతం ఉన్న సుసంపన్న యురేనియం నిల్వలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలో నాశనం చేయడానికి అంగీకారం కుదిరింది. పూర్తిస్థాయి తుది ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ తన అణు కార్యక్రమాలను ఇప్పుడే ఉన్న స్థితిలోనే ఉంచనుంది.
Follow Us