/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/US-Visa-jpg.webp)
H1B Visa
హెచ్-1బీ వీసాదారులు (H1B Visa Holders), వారి భాగస్వాములు, అంతర్జాతీయ విద్యార్థులు, గ్రీన్‌కార్డుదారులకు యూఎస్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ (US Immigration Attorney) లు ట్రావెల్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెన్యువల్ కోసం వీరు వారి దేశాలకు వెళ్తే.. తిరిగి అమెరికాకు రావడం కష్టమవతుందని అధికారులు పేర్కొంటున్నారు. స్వదేశంలోని అమెరికా కాన్సులేట్స్ స్టాంపింగ్‌లో జాప్యం, విస్తృత తనిఖీలు, తిరిగి వచ్చేటప్పుడు అమెరికా విమానాశ్రయాల్లో నిర్బంధం సహా పలు కారణాలతో గ్రీన్ కార్డు హోల్డర్లకు ఇదే విధమైన సూచనలు చేయడం గమనార్హం.
Also Read:Trump: బైడెన్ పిల్లలకు సీక్రెట్ సర్వీస్ రక్షణను తొలగించిన ట్రంప్!
Alert For H1B Visa Holders
సీటేల్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ కృపా ఉపాధ్యాయ్ మాట్లాడుతూ... ‘‘ప్రస్తుతం అమెరికా దాటి వెళ్లాలనుకునే విదేశీయులు వారిలో ముఖ్యంగా హెచ్-1బీ వీసా లేదా ఎఫ్-1 వీసా రెన్యువల్ కోసం వెళ్లేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి’’ అని ఆయన చెప్పారు. ‘‘ఇంటర్వ్యూ మినహాయింపు వీసాదారులకు US ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ అర్హతల్లో మార్పులు చేసింది. గతంలో దరఖాస్తుదారులు ఏదైనా కేటగిరీలో (విజిటర్స్ వీసాలు తప్ప) వలసేతర వీసా పొంది, గడువు ముగిసిన 48 నెలల్లోపు దరఖాస్తు చేసుకుంటే ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఉండేది.. కానీ సవరించిన నిబంధనల ప్రకారం.. 12 నెలల్లోపు గడువు ముగిసిన వలసేతర వీసాదారుల దరఖాస్తుదారులకు మాత్రమే అనుమతిస్తున్నారు.
Also Read: Chittoor: 30 సంవత్సరాల నుంచి పాములు కాటేస్తూనే ఉన్నాయి!
అందువల్ల F-1 వీసా ఉన్న అంతర్జాతీయ విద్యార్థి లేదా హెచ్- 1B వీసాదారులు ఇంటర్వ్యూ స్లాట్ కోసం ఎదురు చూడాలి. ఒకవేళ 12 నెలల కిందట H-1B వీసా పొందినవారికి పొడిగింపు అవసరమైతే ఇంటర్వ్యూ స్లాట్ కోసం కూడా తప్పకుండా వేచి ఉండాల్సిందే’’ అని ఉపాధ్యాయ్ వివరించారు. NPZ లా గ్రూప్ మేనేజింగ్ అటార్నీ స్నేహల్ బాత్రా మాట్లాడుతూ.. ‘‘వీసా అపాయింట్‌మెంట్ దొరకడంలో జాప్యం ఆందోళనలో ఒక భాగం మాత్రమే.. అదనపు పరిశీలన, భద్రతాపరమైన అనుమతులు తప్ప మరే స్పష్టమైన కారణం లేకుండా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్‌లో నిలిచిపోయినవారి గురించి మాకు తెలుసు.. ఆ వ్యక్తి వీసా కోసం గతంలో అనేకసార్లు ఆమోదం పొంది ఉంటే ఇలా జరిగి ఉండకూడదు.. ట్రంప్ గత పదవీకాలం మాదిరిగానే తనిఖీలు కఠినంగా ఉంటాయని భావిస్తున్నాం’ అన్నారు.
Also Read: Ap Crime: నిన్న కాకినాడ..నేడు కోనసీమలో దారుణం..కాలయములవుతున్న కన్నతండ్రులు!
అమెరికా సిటిజెన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ H-1Bని ఆమోదించినా.. కాన్సులేట్ అధికారికి వీసాను తిరస్కరించే హక్కు ఉంటుంది. ఆ దరఖాస్తును పునఃపరిశీలన కోసం తిరిగి USCISకి పంపే అధికారం ఉంటుంది... ఇలాంటి పరిస్థితిలో వెలుపల ఉన్న ఉద్యోగులు అమెరికాకు తిరిగి రావడానికి కష్టంగా మారుతుంది’ అని ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. ‘ప్రయాణం అనివార్యమైతే.. ఒకవేళ స్టాపింగ్ జాప్యం జరిగినా వీసాదారులు, వారి యాజమాన్యాలు స్వదేశం నుంచి పనిచేసుకునేలా ప్రణాళికలను వేసుకోవాలి’ అని ఇమ్మిగ్రేషన్.కామ్ మేనేజింగ్ అటార్నీ రాజీవ్ ఎస్ ఖన్నా వ్యాఖ్యానించారు.
Also Read: Telangana: మందుబాబులకు అదిరిపోయే వార్త... మార్కెట్లోకి ఏకంగా 37 కొత్త బ్రాండ్లు..!