/rtv/media/media_files/2026/02/07/war-2026-02-07-17-17-07.jpg)
దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఏడాది జూన్ నాటికి యుద్ధాన్ని ఆపేలా ఇరు పక్షాలు ఒక అంగీకారానికి రావాలని ట్రంప్ యంత్రాంగం గడువు విధించినట్లు అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇరు దేశాలపై తీవ్ర ఒత్తిడి
ఒకవేళ జూన్ నాటికి శాంతి ఒప్పందం కుదరకపోతే, డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఇరు దేశాలపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. "జూన్ ప్రారంభం నాటికే యుద్ధాన్ని ముగించాలని అమెరికన్లు ప్రతిపాదిస్తున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం వారు ఒత్తిడి పెంచే అవకాశం ఉంది" అని ఆయన అన్నారు. శాంతి స్థాపన కోసం అమెరికా ఒక స్పష్టమైన టైమ్ టేబుల్‌ను కోరుకుంటోందని, ఈ ప్రక్రియను జూన్ లోపే పూర్తి చేయాలన్నది వారి లక్ష్యమని ఆయన వివరించారు.
అబుదాబిలో జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతి లేకపోవడంతో, తదుపరి రౌండ్ త్రిపక్ష చర్చలను అమెరికాలో (బహుశా మయామీలో) నిర్వహించేందుకు ఉక్రెయిన్ అంగీకరించింది. మరోవైపు, రష్యా తన ఆక్రమిత ప్రాంతాలైన డాన్‌బాస్ నుండి ఉక్రెయిన్ వెనక్కి తగ్గాలని పట్టుబడుతోంది, దీనిని ఉక్రెయిన్ ఖరాఖండిగా తిరస్కరిస్తోంది.
Follow Us