Iran-US War: ఇరాన్‌కు బిగ్ షాక్.. B-52 బాంబర్లతో రెచ్చిపోతున్న అమెరికా..

అమెరికా తమ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన  B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్లను రంగంలోకి దింపింది.  ఈ B-52 బాంబర్లు భూగర్భ కేంద్రాలను టార్గెట్ చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్‌ అణు కేంద్రాలైన నటాంజ్‌, ఫోర్డోలపై ఈ బాంబర్లు దాడు చేశాయి.

New Update
US Atatcking on iran with B-52 Bombers

US Atatcking on iran with B-52 Bombers

ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేస్తుండగా.. ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై, ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. ఇప్పటిదాకా జరిగిన యుద్ధంలో ఇరాన్‌లో 1200 మందికి పైగా మృతి చెందడం కలకలం రేపుతోంది. అయితే అమెరికా తమ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన  B--52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్లను రంగంలోకి దింపింది. 

Also read: IRGC కొత్త కమాండర్‌గా ట్రంప్ బద్ధశత్రువు.. అహ్మద్ వాహిది ఎవరో తెలుసా ?

అమెరికా పంపుతున్న ఈ B-52 బాంబర్లు భూగర్భ కేంద్రాలను టార్గెట్ చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్‌ అణు కేంద్రాలైన నటాంజ్‌, ఫోర్డోలపై ఈ బాంబర్లు దాడు చేశాయి. ఇవి ప్రయోగించిన GBU-57 బాంబులు భూమిలోపలికి చొచ్చుకెళ్లాయి. వందల అడులు లోతున ఉన్న అణు రియాక్టర్లను పేల్చేశాయి. దీంతో ఇరాన్ అణు సామర్థ్యం పూర్తిగా దెబ్బతిందని అమెరికా ప్రకటన చేసింది. 

అమెరికా ప్రయోగిస్తున్న ఒక్కో B-52 బాంబర్‌ దాదాపు 32 వేల కిలోల బాంబులు మోసుకెళ్లగలదు. మార్చి 2 నుంచి ఈ బాంబర్లు ఇరాన్ మిస్సైల్స్‌ కేంద్రాలపై దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రాజధాని టెహ్రాన్ సరిహద్దులో ఉన్న IRGC ప్రధాన కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. రాడర్లకు అందకుండానే ఇవి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. బ్రిటన్, డియాగో గార్సియా స్థావరాల నుంచి వీటిని పంపించారు. 

Also Read: డిజిటల్ జనాభా లెక్కలు.. సెన్సస్-2027 షెడ్యూల్ విడుదల

అమెరికా బాంబర్ల దాడులకు ఇరాన్ సైన్యం భారీగా నష్టపోయింది. అక్కడి S-300 రక్షణ వ్యవస్థలు కూడా విఫలమయ్యాయి. మరోవైపు ఇరాన్ భూభాగంపై అమెరికాకు పూర్తి ఆధిపత్యం వచ్చింది. అయితే B-52 బాంబర్లు వాడటం వల్ల పౌరులకు ఎక్కువగా ప్రాణనష్టం జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా ఈ దాడులును వెంటనే ఆపేయాలని కోరుతోంది. అయినప్పటికీ కూడా అమెరికా మార్చి6న కూడా తమ దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ లొంగిపోయేవరకు తమ దాడులు ఆపేది లేదని ట్రంప్ చెప్పారు.  ఈ యుద్ధం ఇంకా నాలుగైదువారాల పాటు జరగొచ్చని పేర్కొన్నారు. దీంతో పశ్చిమాసియాలో శాంతి ఎప్పుడు నెలకొంటుందనేది ప్రశ్నార్థంగా మారింది. 

Advertisment
తాజా కథనాలు