/rtv/media/media_files/2026/03/24/fotojet-12-2026-03-24-13-54-00.jpg)
US Allies Saudi, UAE Edge Towards Joining Iran War
ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై 5 రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం సంచలనం రేపుతోంది. ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధంలోకి మరో రెండు దేశాలు ఎంట్రీ ఇచ్చాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పాల్గొనేందుకు రెడీగా ఉన్నట్లు ఆ కథనంలో వెల్లడించారు.
Also Read: మతం మారితే రిజర్వేషన్లు రద్దు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో అమెరికా తమ వైమానిక స్థావరాలు వినియోగించుకునేందుకు సౌదీ అరేబియా పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు తమ స్థావరాలు వాడుకునేందుకు అంగీకరించింది. ఇక UAE కూడా ఇరాన్‌కు చెందిన ఓ ఆస్పత్రిని, క్లబ్‌ను మూసివేసింది. దీనివల్ల ఇరాన్‌తో సంబంధం ఉన్నటువంటి సహాయ నెట్‌వర్క్‌కు ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు సౌదీ, UAE కూడా సాయం చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ఇరాన్ 'పవర్ హౌస్'.. ట్రంప్‌తో చర్చల వెనుక ఉన్న అసలు వ్యక్తి ఈయనేనా?
ఇదిలాఉండగా ఇటీవల ఇరాన్‌పై ప్రయోగించిన పలు మిస్సైల్స్ బహ్రెయిన్ నుంచే ప్రయోగించినట్లు కొన్ని వీడియోలు బయటపడ్డాయి. అయితే సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధం వల్ల తమ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినే ముప్పు ఉందని గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు హర్ముజ్ జలసంధిని కూడా ఇరాన్ తమ కంట్రోల్‌లోకి తీసుకోవడంతో గందరగోళం నెలకొంది. అందుకే ఈ యుద్ధంలో అమెరికాకు తమ మిత్ర దేశాలు సపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
Follow Us