సిరియాపై అమెరికా దాడులు.. 37 మంది ఉగ్రవాదులు హతం సిరియాలో అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. 37 మంది ఉగ్రవాదులను వైమానిక దాడుల్లో హతమార్చామని అమెరికా ప్రకటించింది. వీళ్లందరూ కూడా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్‌ఖైదా ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్నవారేనని పేర్కొంది. By B Aravind 29 Sep 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి లెబనాన్‌లో హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా కూడా మృతి చెందారు. దీంతో పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి యుద్ధ పరిస్థితులు నడుమ సిరియాలో అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. 37 మంది ఉగ్రవాదులను వైమానిక దాడుల్లో హతమార్చామని అమెరికా ప్రకటించింది. వీళ్లందరూ కూడా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్‌ఖైదా ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్నవారేనని పేర్కొంది. అలాగే మృతుల్లో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలిపింది. Also read: ఇజ్రాయెల్ లెక్క సరి చేసింది! US Airstrikes In Syria అల్‌ఖైదా అనుబంధ 'హుర్రాస్ అల్-దీన్ గ్రూప్'నకు చెందిన ఓ సీనియర్ టెర్రరిస్టుతో పాటు మరో ఎనిమిది మందిని లక్ష్యంగా చేసుకుని వాయవ్య, మధ్య సిరియా ప్రాంతాలపై రెండు వేర్వేరు దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఆ సీనియర్ ఉగ్రవాది స్థానికంగా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. అలాగే అంతకుముందు సిరియాలో ఐసిస్ శిక్షణ స్థావరంపై కూడా వైమానిక దాడులు నిర్వహించామని.. అందులో 28 మంది ముష్కరులను మట్టుబెట్టామని పేర్కొంది. తాజాగా సిరియాలో జరిపిన దాడులతో ఐసిస్ శక్తిసామర్థ్యాలు దెబ్బతిన్నట్లు అమెరికా వెల్లడించింది. తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించేవారిని.. మిత్ర దేశాలు, భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించేవారిని సహించబోమని పేర్కొంది. గతంలో స్థానికంగా పెద్దఎత్తు తమ భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకున్న ఐసిస్ గ్రూప్ మళ్లీ దాడులకు పాల్పడకుండా ఉండేందుకు సిరియాలో అమెరికా ప్రస్తుతం 900 మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. Also Read: భారీ వరదలు..112 మంది మృతి..కొట్టుకుపోయిన వందల మంది! #telugu-news #usa #syria #isis #airstrike మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి