/rtv/media/media_files/2026/03/19/us-aircraft-carrier-moves-away-from-iran-war-for-repairs-after-fire-2026-03-19-10-00-56.jpg)
US aircraft carrier moves away from Iran war for repairs after fire
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. అయితే తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన శక్తిమంతమైన విమాన వాహక నౌక జెరాల్డ్ ఆప్ ఫోర్డ్ యుద్ధం నుంచి వెళ్లిపోయింది. గ్రీస్‌లోని నాటో స్థావరమైన క్రెటెకు మరమ్మతులు చేయించుకునేందుకు వెళ్తోంది.
Also read: గల్ఫ్ దేశాల నుంచి దిగుమతులు.. స్థానిక కరెన్సీల్లోనే చెల్లింపులు
గతవారం ఈ నౌక లాండ్రీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో ఇద్దరు సైలర్లు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లకి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జెరాల్డ్ ఆర్ ఫొర్డ్ ఎర్ర సముద్రం నుంచి క్రెటెలోని సౌద బేకు ప్రయాణం చేస్తోంది. ఇక్కడ కొంతకాలం పాటు ఉండనుంది. మరమ్మతులు చేయించుకుంటుంది. అయితే ఈ క్యారియర్ స్ట్రైక్ గ్రూపులోని మిగిలిన నౌకల ఇంకా యుద్ధంలోనే ఉన్నాయి. కానీ ఈ నౌకలు జెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌తో కలిసి ప్రయాణించడం లేవు.
Also Read: కెనడాలో దారుణం.. ముగ్గురు భారత సంతతి వ్యక్తులు హత్య
వాస్తవానికి ఈ నౌక మరమ్మతులకు వెళ్తున్నట్లు USNI న్యూస్ వెల్లడించింది. కానీ పెంటగాన్ మాత్రం దీనిపై వెంటనే స్పందించలేదు. పెంటగాన్ తీవ్రతను తగ్గించి చూపిస్తోందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. నౌకలో జరిగిన అగ్ని ప్రమాదంలో 600 మంది సిబ్బందికి సంబంధించి బెడ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Follow Us