Trump: గాజా పునరావాసానికి 700 కోట్ల డాలర్లు.. ట్రంప్ సంచలన ప్రకటన

ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజా పరిస్థితులు పూర్తిగా దిగిజారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాజా పునరావాసం కోసం కీలక ముందడుగు పడింది.

New Update
Unied States nets ‘$7 billion’ in pledges, secures Gaza troop commitments

Unied States nets ‘$7 billion’ in pledges, secures Gaza troop commitments

ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజా పరిస్థితులు పూర్తిగా దిగిజారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాజా పునరావాసం కోసం కీలక ముందడుగు పడింది. ఆ ప్రాంతానికి 700 కోట్ల డాలర్ల ప్యాకేజీ ఇచ్చేందుకు శాంతి మండలిలో తొమ్మిది సభ్య దేశాలు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. UAE, మొరాకో, బహ్రైన్, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, ఉజ్బెకిస్థాన్, అజర్‌బైజాన్ , కజకస్థాన్ దేశాలు ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. 

Also Read: దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి జీవిత ఖైదు

అంతేకాదు అయిదు దేశాలు బలగాలను ఇచ్చేందుకు కూడా ముందుకొచ్చినట్లు పేర్కొన్నారు. ముందుగా రఫాలో మోహరిస్తాయన్నారు. ఈ ఆర్థిక సాయం గాజాలో స్థిరత్వానికి పెట్టుబడి అవుతుందని పేర్కొన్నారు. గాజాను పునర్నిర్మించేందుకు 700 కోట్ల డాలర్లు అవసరం అవుతుందని గతంలోనే అధికారులు అంచనా వేశారు. శాంతి మండలికి అమెరికా వెయ్యి కోట్ల డాలర్లు ఇస్తుందని ట్రంప్ కూడా ప్రకటించారు. కానీ అది దేనికోసమనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే ఐక్యరాజ్య సమితి బలపడి, సక్రమంగా పనిచేసేటట్లు శాంతిమండలి చూస్తుందని అన్నారు. 

Also Read: ఎఫ్‌స్టీన్‌ ఫైల్స్‌ వ్యవహారం.. బ్రిటన్ మాజీ రాకుమారుడు ఆండ్రూ అరెస్టు..

ఇదిలాఉండగా ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక మొదటి ఏడాదిలోనే 8 యుద్ధాలు ఆపాననని.. వాటిలో ఒక్కదాని గురించి కూడా ఐక్యరాజ్యసమితిలో మాట్లాడలేదని తెలిపారు. తాను లేనప్పుడు కూడా ఐక్యరాజ్య సమితి బలంగా పనిచేసేందుకు శాంతిమండలి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. 

Advertisment
తాజా కథనాలు