/rtv/media/media_files/2026/03/10/uae-2026-03-10-16-02-55.jpg)
UAE condemns drone attack on its consulate in Iraq's Erbil
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతంలో ఉన్న UAE కాన్సులేట్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఈ యుద్ధంలో తాము అనవసరంగా చిక్కుకున్నామని UAE వ్యాఖ్యానించిన కొన్ని గంటకే ఈ దాడులు జరిగాయి. ఈ దాడిలో కాన్సులేట్ స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. UAE విదేశాంగ శాఖ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. ఎంబసీలను, ప్రాంగణాలను టార్గెట్ చేసుకొని దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని విమర్శించింది.
Also Read: టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా...ఏకంగా రూ.131 కోట్ల రివార్డు
UAE ప్రభుత్వం ఈ దాడిని ఖండించినా ఇది ఎవరు చేశారనే విషయాన్ని చెప్పలేదు. మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తమ దేశాన్ని టార్గెట్ చేసుకోవడంపై UAE తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అనవసరంగా మమ్మల్ని ఈ యుద్ధంలోకి లాగుతున్నారంటూ మండిపడింది. ఇరాన్‌పై తాము దాడులు చేయడం లేదని.. యుద్ధంలోకి రావాలని అనుకోవడం లేదని స్పష్టం చేసింది.
Also Read: దేశంలో వంట గ్యాస్ కొరత.. అక్కడ హోటల్స్ అన్ని క్లోజ్
ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే ఇరాక్‌లోని యూఏఈ కాన్సులేట్ టార్గెట్‌గా దాడులు చేశారు. మరోవైపు మిడిల్ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో తమ సైనిక సామర్థ్యాలు పెంపొందించుకునేందుకు UAE సిద్ధమైంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ప్రాంతంలో తమ క్షిపణులు, విమానాలు పంపిస్తున్నామని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ అన్నారు. బోయింగ్ కంపెనీ తయారుచేసిన E7A వెడ్జ్‌టైల్ ఫ్లైట్‌ను పంపుతున్నామని ఇది నాలుగు వారాల పాటు గల్ఫ్ దేశాల్లో గగనతలాన్ని పర్యవేక్షిస్తుందని తెలిపారు.
🚨‼️⚡️BREAKING:
— MOSCOW NEWS 🇷🇺 (@MOSCOW_EN) March 9, 2026
A violent attack by marchers on the UAE consulate in Erbil, Kurdistan, Iraq.🔥🔥 pic.twitter.com/QrW1dijXQg
Follow Us