/rtv/media/media_files/2026/03/14/two-oil-pipelines-helping-saudi-arabia-and-uae-bypass-the-strait-of-hormuz-2026-03-14-12-34-43.jpg)
two oil pipelines helping Saudi Arabia and UAE bypass the Strait of Hormuz
ప్రపంచానికి చమురు సరఫరా చేయడంలో పర్షియన్ గల్ఫ్ కీలకమైనది. చమురు రవాణా చేసేందుకు నౌకలు హర్ముజ్ జలసంధిని దాటి వెళ్లాలి. ప్రపంచ చమురు రవాణా వాటాలో దాదాపు 20 శాతం ఈ మార్గం నుంచే వస్తోంది. ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న ఈ జలసంధి అత్యంత ఇరుకైనది. దీని వెడల్పు కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఈ జలసంధి మార్గాన్ని తమ కంట్రోల్‌లోకి తెచ్చుకుంది. ఆ రూట్‌లో వస్తున్న నౌకలపై దాడులు చేస్తోంది. దీంతో చాలాదేశాల్లో చమురు,గ్యాస్ కొరత నెలకొంది. అయితే చమురు రవాణాకు హర్ముజ్ కాకుండా ప్రత్యామ్నాయ మార్గం లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
Also Read: మొజ్తాబా ఖమేనీ, నెతన్యాహు మరణించారా?..వెలుగులోకి సంచన నిజాలు
హర్ముజ్‌కు ప్రత్యామ్నాయ మార్గం ఏంటి ?
హర్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయ మార్గాన్ని మిడిల్ఈస్ట్ దేశాలు ఇప్పటికే తీసుకొచ్చాయి. అదే పైప్‌లైన్ మార్గం. ప్రస్తుతం దీనిపై ఇంకా పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు రెండు పైప్‌లైన్‌లు నిర్మించారు. హర్ముజ్ జలసంధిపై కాకుండా వీటిద్వారానే చమురును రవాణా చేసుకోవచ్చు. ఇందులో ఒకటి UAE నిర్మించిన హబ్షాన్ ఫుజైరా పైప్‌లైన్. ఇది అబుదాబిలోని హబ్షాన్ చమురు క్షేత్రాల నుంచి ఒమన్ గల్ఫ్ తీరంలో ఉన్న ఫుజైరా ఓడరేవు వైపునకు సాగుతుంది. రోజుకు సుమారు 1.5 మిలియన్ నుంచి 1.8 మిలియన్ బ్యారెల్స్ చమురును రవాణా చేయగలదు. మరొకటి సౌదీ అరేబియా నిర్మించిన ఈస్ట్‌వెస్ట్ పెట్రోలైన్. ఎర్ర సముద్రం తీరంతో లింక్ చేస్తూ దీన్ని నిర్మించారు. పర్షియన్ గల్ఫ్ తీరంలోని ప్రధాన చమురు కేంద్రాల నుంచి పశ్చిమ తీరంలోని యాన్బు ఓడరేవుకు చమురును సరఫరా చేస్తుంది. దీని సామర్థ్యం దాదాపు రోజుకు 5 మిలియన్ బ్యారెల్స్‌గా ఉంది.
సమస్య ఏంటి ?
సౌదీ అరేబియాలోని యాన్బు ఓడరేవుకు రోజుకు 5 మిలియన్ బ్యారెళ్ల చమురును పైప్‌లైన్ ద్వారా రవాణా చేసే సామర్థ్యం ఉంది. కానీ ఈ ఓడరేవు అంత పెద్దదిగా ఉండదు. దాని సామర్థ్యం కేవలం 2.5 మిలియన్ బ్యారెళ్లు మాత్రమే ఉంది. దీంతో అంత చమురును లోడ్ చేయలేకపోతోంది. ఇక యూఏఈలోని ఫుజైరా ఓడరేవుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా చేయొచ్చు. అంటే ఇక్కడ పైప్‌లైన్‌ల ద్వారా కేవలం 4 మిలియన్ బ్యారెళ్ల చమురును మాత్రమే రవాణా చేయొచ్చు. కానీ హర్ముజ్ జలసంధి ద్వారా రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా చేయొచ్చు.
Also Read: భారత చమురు కంపెనీలకి రోజుకు 2 వేల కోట్ల నష్టం
మరో సమస్య ఏంటంటే పైప్‌లైన్ మార్గాన్ని వినియోగించేందుకు ట్రక్కులు, ఓడలు, టెర్మినల్స్ ఇతర వ్యవస్థలు కూడా సిద్ధంగా లేవు. ఒకవేళ యుద్ధం ఇలాగే కొనసాగితే ఈ పైప్‌లైన్‌లపై కూడా దాడులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ మార్గంలో రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం కూడా కష్టమే. ఎందుకంటే పైప్‌లైన్‌లు వేలాది కిలోమీటర్లు భూమిపై వెళ్తాయి. వేర్వేరు దేశాల గుండా ఇవి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఏవైనా రాజకీయ విభేదాలు తలెత్తితే ఈ సరఫరా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఉదాహరణకు ఇరాన్ నుంచి టర్కీకి వెళ్లే పైప్‌లైన్ మార్గం గుండా వెళ్లే చమురు రవాణా తరచుగా రాజకీయ కారణాలతో ఆగిపోతుంది. యుద్ధ సమయాల్లో లేదా ఉగ్రదాడుల సమయంలో ఈ పైప్‌లను పేల్చేయడం కూడా సులభంగా మారుతుంది. అందుకే ఈ పైప్‌లైన్ మార్గాలు హర్మూజ్ జలసంధికి పూర్తిగా ప్రత్యామ్నాయ మార్గంగా కాలేవని నిపుణులు చెబుతున్నారు.
Follow Us