/rtv/media/media_files/2025/03/06/VOlATt8vggHaV27VH68J.jpg)
Death Sentence
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (UAE)లో ఇద్దరు భారతీయులకు అక్కడి ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసింది. మన విదేశాంగ శాఖ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. బాధిత కుటుంబాలకు కూడా సమాచారం అందించింది. ఉరిశిక్షకు గురైన వాళ్లని మహమ్మద్ రినాష్ అరింగిలొట్టు, మురళీధరన్ పెరుమ్తట్టు వలప్పిల్‌గా గుర్తించారు. వీళ్లిద్దరూ కూడా కేరళకు చెందిన వారు కావడం విశేషం.
Also Read: పెళ్లైన రెండోరోజే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. షాక్‌లో వరుడు, అతని కుంటుంబం ఏం చేశారంటే!
మహమ్మద్ రినాష్.. ఓ యూఏఈ వాసి హత్య కేసులో దోషిగా తేలాడు. అలాగే ఓ భారతీయుడిని హత్య చేసిన కేసులో మురళీధరన్ కూడా దోషిగా తేలాడు. దీంతో వీళ్లిద్దరికీ యూఏఈ ప్రభుత్వం ఉరిశిక్షను అమలు చేసింది. వీళ్లకు అవరసరమైన దౌత్య, న్యాయం సాయం కూడా తాము అందజేశామని భారత విదేశాంగశాఖ తెలిపింది.
Also Read: పార్టీ మారనున్న నీతీశ్ కుమార్.. బిహార్ రాజకీయాల్లో పీకే సంచలనం!
ఇదిలాఉండగా.. యూఏఈ జైల్లో మరో భారతీయ మహిళ షెహజాది ఖాన్‌కు కూడా ఉరిశిక్ష అమలు చేసిన సంగతి తెలిసిందే. తాను పనిచేసే యజమాని కొడుకు మరణానికి కారణం ఆమెనే అని కోర్టులో నిర్దారణ అయింది. దీంతో ఆమెకు ఉరిశిక్ష విధించారు. తన కూతురుని బలవంతగా నేరం ఒప్పుకునేలా చేశారని షెహజాది తండ్రి కూడా న్యాయపోరాటం చేశారు. అయినా ఫలితం దక్కలేదు. చివరికి ఫిబ్రవరి 15న ఆమెను ఉరి తీశారు. అయితే ముగ్గురు భారతీయులకు యూఏఈలో ఇలా ఉరిశిక్ష పడటం చర్చనీయాంశమవుతోంది.
Also Read: తమిళనాడులో దారుణం.. కుటుంబాన్ని బలి చేసుకున్న రమ్మీ
Also Read: రాహుల్ గాంధీకి కోర్టు షాక్.. ఆ కేసులో రూ.200 జరిమానా.. ఎందుకో తెలుసా!