/rtv/media/media_files/2026/04/11/love-story-2026-04-11-21-45-59.jpg)
a love story that conquered life.
Love story : నేటి సమాజంలో భర్తలను చంపి డ్రమ్ముల్లో కుక్కడం, భార్యలను చంపి కక్కర్లో ఉడికించడం..భర్తను వదిలేసి మరోకరితో వెళ్లిపోవడం, భార్యపిల్లల్ని కాదని మరో స్ర్తీతో గడపటం వంటి కథలే మనం చూస్తున్నాం. అల్పసంతోషం కోసం ఆప్తులను దూరం చేసుకుంటున్న జంటలను చూస్తున్నాం. కానీ.. ఈ భార్యభర్తల కథ వింటే కన్నీళ్లు రావు...కానీ, మన మనసులో కదలిక వస్తుంది.. ఒకరికొకరు కాదు..ఇద్దరూ ఒక్కటే అనే అర్థానికి పరామార్థం చెబుతుందీ కథ..ఈ కథ చదివితే నిజంగా కళ్లు చెమ్మ గిల్లుతాయి...మనసు తీయని బాధతో నిండిపోతుంది. హృదయంలో ఒక రకమైన స్ఫూర్తి నిండి నేటి సమాజంలోని పోకడల మీదా విరక్తి కలుగుతుంది.
Crazy what having someone who won't give up on you can do for you. This is will forever be a beautiful story https://t.co/UH7Jzd0TEL
— Bhuti Olishayayo Ikhekhe (@BantuMthabela_) April 11, 2026
సాధారణంగా జీవితాన్ని జయించిన ప్రేమకథ అనగానే..శీర్షిక బాగుందే అనుకుంటాం.. కానీ, కథనంలో పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నావారి కథ ఒకటి ఉంటుంది. వారేదో సాధించారని క్లుప్తంగా చెప్పేస్తారు. కానీ ఇది అలాంటి కథ కాదు...నిజం చెప్పాలంటే అసలు కథే కాదు..అవును ఇది కథ కాదు నిజం..వాస్తవం..ఓ జీవితం..ఇంకా చెప్పాలంటే రెండు శరీరాలు..ఒక్క ఆత్మకథ..
భార్యభర్తలు అన్నందుకు యాంత్రిక జీవితంలో ముందుకు సాగుతూ.. ఏదో బ్రతికేస్తున్నాం అని కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి కష్టంలో ఒకరు తోడుగా నిలుస్తేనే ఆ దాంపత్యానికి అర్ధం ఉంటుందనేది ఈ కథనంలోని సారాంశం... ఒకసారి వాస్తవంలోకి వెళ్దాం..
ఇది చైనాకు చెందిన డెంగ్ యూకాయ్ కథ. అతని భార్య యే, 2023లో క్యాన్సర్ కారణంగా ఆమె కోమాలోకి వెళ్లింది. బ్రెయిన్ ట్యూమర్ తో ఆమె చనిపోవడం ఖాయం అని డాక్టర్లు చెప్పారు. పూర్తిగా నడవలేని స్థితికి చేరుకుంది. బెడ్‌కే పరిమితమై కృంగిపోయింది. తన వల్ల భర్త పడుతున్న బాధను చూడలేక తాను చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని డాక్టర్లను కూడా ప్రాధేయ పడింది. భర్తకు తనవల్ల కష్టం రాకూడదని అతను సుఖంగా, తన పిల్లలతో సంతోషంగా ఉండాలని తలచింది.
కానీ, భర్త భర్త డెంగ్ యూకాయ్ వినలేదు. తన భార్య మీద ఉన్న ప్రేమతో అతను తన ఉద్యోగాన్ని వదిలేశాడు. ఇక నుంచి నీకోసమే ఈ జీవితం అంటే రోజు ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. ఆమెను సంతోషంగా ఉంచడం కోసం తనకు తెలిసిన అన్ని రకాల విద్యలు ప్రదర్శించాడు. నవ్వించాడు. బాధను మరిచిపోయేలా చేశాడు. వైద్యం కోసం రూ.కోట్లకు పైగా ఖర్చుపెట్టాడు. ఒక రకంగా ఆయన విధితో పోరాటం చేశాడు. తన సంకల్పం ఎంత గట్టిదో చూపించాడు. ప్రతీ రోజూ ప్రతీ క్షణం బెడ్‌కే పరిమితమైన భార్య ముందు డ్యాన్స్‌లు చేస్తూ నవ్వించే యత్నం చేశాడు. ఆశ్చర్యం క్రమంగా ఆమె కోలుకుంది. రెండు సంవత్సరాల్లో సాధారణ స్థితికి వచ్చింది. దాదాపు చనిపోయింది అనుకున్న ఆమె ఇపుడు ఆయన కళ్లముందు నడుస్తుంటే ఆయన ఆనందానికి హద్దుల్లేవు. యే మళ్లీ తన పాత రోజుల్లోకి వచ్చేసింది. భర్త ప్రేమ శక్తితో భార్య తిరిగి జీవం పోసుకుంది.. లౌకిక జీవితాన్ని మళ్లీ చూడసాగింది. ఇపుడు వారిద్దరూ ప్రపంచంలోని ఎన్నో జంటలకు ఆదర్శంగా నిలిచారు.
Follow Us