Trump: విదేశాలపై ట్రంప్‌ టారీఫ్‌.. అమెరికాకు మాంద్యం తప్పందంటున్న పెట్టుబడిదారులు !

విదేశాలపై ట్రంప్ టారీఫ్‌ ప్రకటనతో స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతున్నాయి. అమెరికాతో పాటు అన్ని ప్రధాన మార్కెట్లు కూడా పతనమవుతున్నాయి. ఈ టారిఫ్‌ల నిర్ణయం అమెరికాను మాంద్యంలోకి తీసుకెళ్లే ఛాన్స్ ఉందని పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

New Update
Supreme Court

Supreme Court

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. తాజాగా వివిధ దేశాలపై పరస్పర సుంకాలు ప్రకటించారు. భారత్‌పై కూడా 26 శాతం సుంకం విధించారు. అయితే ట్రంప్‌ టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయని, కార్పొరేట్ ఆదాయాలను దెబ్బతీస్తాయని, ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతాయని పలవురు పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ట్రంప్‌ ప్రకటనతో స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతున్నాయి. అమెరికాతో పాటు అన్ని ప్రధాన మార్కెట్లు కూడా పతనమవుతున్నాయి.     

Also Read: ట్రంప్‌ సుంకాలు భారత్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయి: రాహుల్ గాంధీ

దీనికి సంబంధించి క్యాపిటల్ మార్కెట్ కంపెనీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ క్యాపిటల్ అడ్వైజర్స్ సీఈఓ జేహాట్‌ఫీల్డ్‌ మాట్లాడారు. '' ట్రంప్ ప్రకటన మార్కెట్లకు దారుణమైన పరిస్థితి. అమెరికాను మాంద్యంలోకి తీసుకెళ్లే ఛాన్స్ ఉందని'' అన్నారు.  ''ఈ వ్యవహారంలో మనం ఒకవైపే చూస్తున్నాం. కానీ మనం చేసే దానికి ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయన్నది కూడా ముఖ్యం. మొత్తానికి మార్కెట్ ఈ పరిస్థితులను ఎలా తీసుకుంటుందో చూడాలని'' గ్రీన్‌వుడ్ క్యాపిటల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌ వాల్టర్ టాడ్ వ్యాఖ్యానించారు. 

'' ఇప్పుడు మేము బలహీనమైన స్థానంలో ఉన్నాము. ఈ పరిస్థితులు సడెన్ రికవరీ లేదా బ్రేక్‌డౌన్‌కు మమ్మల్ని రెడీగా ఉంచుతుందని'' ఇంటరాక్టివ్ బ్రోకర్స్ చీఫ్ స్ట్రాటజిస్ట్ స్టీవ్ సోస్‌నిక్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు వచ్చినప్పటి నుంచి దీనివల్ల అమెరికాకే నష్టం జరుగుతుందనే అంచనాలు కూడా వచ్చాయి. విదేశాల నుంచి వస్తున్న వస్తువులపై పన్నులు విధించడం వల్ల వాటి ధరలు పెరగడంతో అమెరికా ప్రజలకే నష్టం జరుగుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. 

Also Read: పవన్ ఇదేం సినిమా కాదు.. టైమ్ వేస్ట్ చేయొద్దు: ప్రకాశ్ రాజ్ మరో సంచలనం!

అయితే ట్రంప్‌ టారిఫ్‌లపై విదేశాల నుంచి వ్యతిరేకత వస్తున్నా కూడా ఆయన మాత్రం పట్టించుకోవడం లేదు. చైనా, వియాత్నాం, మెక్సికో, తైవాన్, జపాన్, కెనడా, ఇండియా, యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు అమెరికాకు భారీ కూడా భారీగా వాణిజ్య లోటు ఉంది. దీన్ని పదేపదే  ట్రంప్ ప్రస్తావించేవారు. దీంతో దిగుమతులపై ప్రతీకార సుంకాల ద్వార వేలాది కోట్ల డాలర్ల అదనపు ఆదాయం పొందాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఆయన ఎన్నికల్లో పన్నులకు కోతలు విధిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని అమలు చేసేందుకు టారిఫ్‌ల నుంచి వచ్చే నిధులను వినియోగించుకోవచ్చన్నది ఆయన ఆలోచనగా అంటున్నారు. 

 rtv-news | national-news | tariff tax

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan Kalyan: 3 రోజులపాటు ఆస్పత్రిలోనే పవన్‌ చిన్న కుమారుడు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ‌కు ప్రాణాపాయం తప్పింది. ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకు మార్క్‌ ను షిఫ్ట్‌ చేసినట్లు సమాచారం. బ్రాంకో స్కోప్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.

New Update
Pawan Kalyan younger son

Pawan Kalyan younger son Photograph: (Pawan Kalyan younger son)

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  చిన్న కుమారుడు మార్క్ శంకర్ తాజా హెల్త్ అప్‌డేట్ వచ్చింది. మార్క్ శంకర్‌ను బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి జనరల్ వార్డుకు తరలించారు. కానీ మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు సమాచారం.

Also Read: Hyderabad: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

సింగపూర్ లోని స్కూల్ బిల్డింగ్ లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, మరో 19 మందికి తీవ్ర గాయాలు అయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళిన పవన్ కల్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. మార్క్ శంకర్ ను చూసి పవన్ తల్లడిల్లిపోయారు. మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకొంటున్నాడు. 

Also Read: America: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

అయితే అగ్నిప్రమాదంలో వచ్చిన పొగ ఊపిరితిత్తుల దగ్గర పట్టేయడం వల్ల భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి ముందుగానే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అగ్నిప్రమాదంలో మార్క్ కు చేతులు, కాళ్ళకు కాలిన గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తులలో పొగ చేరడంతో ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్స అందించారు. నేటి ఉదయం పరీక్షించిన డాక్టర్లు ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకు మార్క్ ను షిఫ్ట్ చేశారు. 

పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు సింగపూర్‌లోని హాస్పిటల్ చికిత్స కొనసాగిస్తున్నారు. బ్రాంకో స్కోప్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఊపిరితిత్తులు, శ్వాసనాళాల లోపలి భాగాల్లో ఏమైనా సమస్య ఉంటే బ్రాంకోస్కోప్ ద్వారా గుర్తిస్తారు. ఈ బ్రాంకో స్కోప్ పరికరం అనేది చిన్నగా సన్నని ట్యూబ్ రూపంలో ఉంటుంది, దీని చివరన కెమెరా లేదా లెన్స్, లైట్ ఉంటుంది.

దీనిని నోటి లేదా ముక్కు ద్వారా శ్వాసనాళాల్లోకి పంపి ఊపిరితిత్తులు పరిస్థితిని చెక్ చేస్తారు. పొగ వల్ల ఉపిరితిత్తులకు సమస్యలు తలెత్తుతాయా అనేది ప్రాథమికంగా దీని ద్వారా పరిశీలించనున్నారు. మార్క్ శంకర్ కు బ్రాంకో స్కోపీ చికిత్స చేస్తున్నారని తెలిపారు.  

Also Read: America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

Also Read: USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

Pawan Kalyan | pawan kalyan son mark | pawan kalyan son mark shankar | pawan son mark shankar school fire incident | pawan son mark shankar school incident | health-update | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment