/rtv/media/media_files/2025/03/02/3f4Yn6mk1nHjPIhr56pt.jpg)
Donald Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాను తీసుకున్న చర్యల వల్లే అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు భారీగా తగ్గిపోయాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో వాళ్లని స్వదేశాలకు పంపించిన సంగతి తెలిసిందే. ఈ చర్యల వల్లే ఫిబ్రవరి నాటికి అక్రమ వలసదారుల సంఖ్య చరిత్రలోనే తక్కువ స్థాయిలో పడిపోయినట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాపై అక్రమ వలసదారుల దండయాత్ర ముగిసినట్లు పేర్కొన్నారు.
Also read: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !
ఫిబ్రవరిలో 8,326 మంది అక్రమ వలసదారులు మాత్రమే దేశ సరిహద్దుల్లో పట్టుబడ్డట్లు తెలిపారు. జో బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతినెల అమెరికాలోకి 3 లక్షల మంది అక్రమంగా ప్రవేశించేవారని ట్రంప్ గుర్తు చేశారు. మొత్తంగా దేశంలో 95 శాతం వలసలు తగ్గినట్లు పేర్కొన్నారు. తన పాలనలో ఎవరైనా చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించాలని యత్నిస్తే భారీగా జరిమానాలు విధిస్తామన్నారు. అలాగే తక్షిణ బహిష్కరణను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు.
అయితే ట్రంప్ చేసిన ప్రకటనలను పలు వార్త సంస్థలు ఖండించాయి. జో బెడెన్ అధికారంలో ఉన్న చివరివారంలో దాదాపు 20,086 మంది అక్రమ వలసదారులను గుర్తించినట్లు చెప్పాయి. ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చాక మొదటివారంలో 7,287 మంది అక్రమ వలసదారులను గుర్తించినట్లు తెలిపాయి. ట్రంప్ వచ్చాక కేవలం 65 శాతమే అక్రమ వలసలు తగ్గినట్లు చెప్పాయి.
Also Read: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!
ఇదిలాఉండగా ఇటీవల అమెరికా నుంచి అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో పంపండం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. భారతీయులను కూడా వెనక్కి పంపించారు. భారత ప్రభుత్వం కూడా ట్రంప్ తీసుకున్న చర్యలకు మద్దతు పలికింది. అక్రమ వలసదారులకు తాము కూడా వ్యతిరేకమేనని పేర్కొంది. అయితే భారతీయులకు సంకెళ్లు వేసి తరలించడం దుమారం రేపింది. దీంతో కేంద్రం విజ్ఞప్తి మేరకు మహిళలకు, చిన్నారులకు సంకెళ్లు వేయకుండానే పంపించింది.