/rtv/media/media_files/2024/12/10/GhFWxspf9iimxnkJSjTt.jpg)
అమెరికాలో ఉన్న వలసదారులు వెంటనే దేశం విడిచి వెళ్ళిపోవాలని కొత్త అధ్యక్షుడు ట్రంప్ సందేశం ఇచ్చారు. ఏ దేశాల వాళ్ళైతే ఉన్నారో వాళ్ళన వెంటనే తమ దేశాలు పిలిపించుకోవాలని ఆయన కోరారు. లేకపోతే లేకుండా ఆ దేశాలతో బిజినెస్ రిలేషన్ షిప్ కట్ చేసుకుంటామని ట్రంప్ అన్నారు. వలసదారులను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించే దేశాలకు తాను వ్యాపారాన్ని చాలా కష్టతరం చేసేస్తానని చెప్పారు. ఆ దేశాలకు సుంకాలను భారీగా పెంచేస్తానని చెప్పారు.
Also Read: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..!
సైనిక చర్యలు తప్పవు..
వలసదారుల పట్ల ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. అక్రమవలదారులు ఎవరున్నా వాళ్ళపై సైనిక చర్యలు తీసుకుంటానని చెప్పారు. అమెరికా చట్టాలను అనుసరించే ఎవరైనా తమ దేశంలో ఉండేలా చూసకుంటామని ట్రంప్ అన్నారు. 2024 పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన డొనాల్డ్ ట్రంప్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. ట్రంప్ కు ఈ అవార్డు రావడం ఇది రెండోసారి. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి చారిత్రాత్మక విజయం సాధించడంతో 2024 పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఎంపికయ్యారు.
Also Read: RBI: రైతులకు గుడ్ న్యూస్..తాకట్టు లేకుండా 2లక్షల రుణం
Also Read: మరోసారి తన అన్నపై రెచ్చిపోయిన షర్మిల