/rtv/media/media_files/2025/01/24/IXlWvvZzTo3NVH4nHB23.jpg)
USA Immigrants
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మాట మీద నిలబడుతున్నారు. వచ్చిన వెంటనే అక్రమ వలసదారులను ఏరిపారేస్తానని చెప్పారు. దానికి తగ్గట్టే చర్యలు చేపట్టారు. ిప్పటికే మెక్సికో బోర్డ్ దగ్గర 1500 మంది సైన్యాన్ని డిప్లాయ్ చేశారు. దానికి తోడు ఇప్పుడు అమెరికా దేశం మొత్తంలో ఎవరు అక్మంగా ఉంటున్నారో వారందరినీ పేరుపేరునా ఏరిపారేస్తున్నారు. ఈ క్రంలో 538 మందిని ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. మరో 373 మందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అరెస్టైన వారిలో ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా, లైంగిక నేరాల వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారు. వీరిని అమెరికా నుంచి తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనికి కోసం ప్రత్యేక విమానాలు కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాయి.
అతి పెద్ద ఏరివేత...
మరోవైపు అక్రమ వలసలపై వైట్ హౌస్ మరో సారి స్పందించింది. ఇది అమెరికా చరిత్రలోనే అతి పెద్ద బహిష్కరణ ఆపరేషన్ అంటూ ట్వీట్ చేసింది. అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులు కానీ, ఇక మీదట ప్రవేశించాలని అనుకుంటున్న వారు గానీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని వైట్ హౌస్ హెచ్చరించింది. ముందు నుంచీ చెబుతున్నట్టుగానే అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలకు బలమైన సందేశాన్ని పంపిస్తున్నారని తెలిపింది.
దేశానికి వచ్చేయండి...
మరోవైపు అక్రమ వలసలపై భారత్ కూడా స్పందించింది. దీనికి తాము కూడా వ్యతిరేకమే అంటూ వంత పాడింది. అక్రమ వలసలు అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని స్పష్టం చేసింది. అలాగే వీసా గడువు ముగిసినా లేదా సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికా/ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ిలా చిక్కుకుపోయిన వారు తమతో సంబంధిత డాక్యుమెంట్లను పంచుకోవాలని సూచించింది.